Panipuri Water : పానీపూరి వాటర్ టేస్టీగా ఉన్నాయని జుర్రేస్తున్నారా ? మీకో షాకింగ్ న్యూస్..

పానీపూరి వాటర్ లో యాసిడ్ కలిపారో లేదో ఎలా తెలుస్తుందనేదే మీ సందేహం అయితే .. ఆ నీరు ముదురు రంగులో కూడా లైట్ రంగులో ఉంటే యాసిడ్ కలిపినట్లేనట. పేపర్ కప్ కాకుండా స్టీల్ బౌల్ లేదా స్టీల్ గ్లాస్ లో వాటర్ పోసి చూస్తే.. దాని అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడుతాయి.

  • Written By:
  • Publish Date - May 4, 2024 / 08:28 PM IST

Panipuri Water : సీజన్ తో సంబంధం లేకుండా తినే ఫాస్ట్ ఫుడ్ ఏదైనా ఉందంటే.. అది పానీపూరి, ఫాస్ట్ ఫుడ్. మండు వేసవిలోనూ సాయంత్రం వేళ అలా స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల వైపు ఓ లుక్కేస్తే.. పానీపూరి బండ్ల వద్ద క్యూ కనిపిస్తుంది. నలుగురు ఐదుగురు గోల్ గప్పాల కోసం ప్లేట్లు పట్టుకుని నిలబడి ఉంటారు. ప్లేట్ లో పానీపూరి ఇలా వేయగానే.. అలా గుటుక్కున మింగేస్తారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మెట్రో సిటీల్లో పానీపూరి లవర్స్ ఎక్కువే. ఒక్కప్లేస్ లో టేస్ట్ బాగుందంటే.. ఎంత దూరమైనా దానికోసం అక్కడికే వెళ్తుంటారు.

కొన్ని బండ్లవద్ద మసాలా వాటర్ టేస్టీగా ఉంటుంది. ఒకట్రెండు ప్లేట్లు పానీపూరి తిన్నాక.. చివర్లో అడిగి మరీ పోయించుకుని తాగుతారు. అయితే.. పానీపూరి ప్రియులకు ఇప్పుడో షాకింగ్ న్యూస్. సాధారణంగా ఈ నీటిని చింతపండు రసం, పుదీనా, కొత్తిమీర, అల్లం కలిపి చేసిన మసాలా పేస్ట్ ను కలుపుతారు. అయితే.. ఈ నీళ్లలో టేస్ట్ కోసం కొద్దిగా యాసిడ్ ను కూడా కలుపుతున్నారని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులే చెప్పడం గమనార్హం. అందుకే ఆ వాటర్ రుచిగా ఉంటున్నాయని, జనాలు కూడా దానికి అడిక్ట్ అయ్యారని చెబుతున్నారు.

పానీపూరి వాటర్ లో యాసిడ్ కలిపారో లేదో ఎలా తెలుస్తుందనేదే మీ సందేహం అయితే .. ఆ నీరు ముదురు రంగులో కూడా లైట్ రంగులో ఉంటే యాసిడ్ కలిపినట్లేనట. పేపర్ కప్ కాకుండా స్టీల్ బౌల్ లేదా స్టీల్ గ్లాస్ లో వాటర్ పోసి చూస్తే.. దాని అంచుల చుట్టూ మచ్చలు ఏర్పడుతాయి. అలా కనిపెట్టలేకపోతే.. ఒక అబ్జర్వేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. గొంతులో మంట, చికాకు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తే.. పానీపూరి వాటర్ లో యాసిడ్ కలిపినట్లే. పానీపూరి తిన్నాక మీకు వాంతులు లేదా వికారం అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించవచ్చు. కాబట్టి మీ పిల్లల్ని పానీపూరి వంటి వాటికి దూరంగా ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Mango Peel Tea : మామిడి తొక్కలతో టీ తాగారా? ఎలా తయారు చేయాలంటే.. ప్రయాజనాలు..