Site icon HashtagU Telugu

Sitting Work : రోజంతా ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా?.. ఈ సమస్యలు ఖాయం..

Sitting for long periods of time can cause these problems

Sitting for long periods of time can cause these problems

ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువసేపు సిస్టమ్(System) ముందు కూర్చొని పనిచేయడం వంటివి చేస్తున్నారు. దీని వలన మన బ్రెయిన్ చాలా వీక్ అవుతుంది. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల ఇంకా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

* ఎక్కువసేపు కూర్చొని(Sitting Work )పని చేయడం వలన మన శరీరంలోని మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. నాడీసంబంధ పరిస్థితుల ప్రభావం పెరిగేలా చేస్తుంది.
* ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మనకు పని మీద ఏకాగ్రత తగ్గుతుంది.
* ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మానసికంగా అలసటకు లోనవుతాము.
* ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం వలన మనకు డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.
* ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మన మెదడులో సమాచార ప్రాసెసింగ్ పని నెమ్మదిస్తుంది. దీని వలన మన మెదడు తొందరగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం కష్టమవుతుంది.
* BDNF అనేది మన మెదడులో న్యూరోనల్ మనుగడ మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మన మెదడులో జ్ఞాపకశక్తికి అవసరం. కానీ మనం ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన BDNF స్థాయిలు తగ్గడం జరుగుతుంది.
* ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.
* ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మన శరీరంలో ఒత్తిడి పెరుగుతుంది.
* ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వలన మెడ నొప్పి, వెన్ను నొప్పి వస్తుంది.

ఇక సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువసేపు పనిచేసేవారికి ఇవే కాకుండా కళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు కూర్చొని.. అది సిస్టమ్ వర్క్ అయినా, ఇంకేదైనా పని చేసేవారు ఎవరైనా వారు చేసే పనిలో మధ్యలో లేచి నడుస్తూ ఉండడం వంటివి చేయాలి. ఇంకా శారీరక శ్రమ కలిగే పనులు కూడా చేయాలి. మార్నింగ్ వాక్ లేదా వ్యాయామం, యోగా వంటివి చేయాలి. పని మధ్యలో గంటకు ఒకసారి అయినా 5 నిముషాలు బ్రేక్ ఇవ్వాలి. దీని వలన మనకు కలిగే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

Also Read : Thamalapaku Rasam : తమలపాకులతోనూ ఇలా రసం చేసుకుని.. అన్నంలో తినొచ్చు !