Slippers At Home: మీరు కూడా ఇంటి లోపల హాల్, బెడ్ రూమ్, కిచెన్, బాత్రూమ్, గ్యాలరీ ఇలా అన్ని ప్రదేశాలలో చెప్పులు (Slippers At Home) వేసుకుంటున్నారా? అయితే ఈ సమాచారం మీకు చాలా ముఖ్యమైనది. ఇంటి లోపల మన పాదాలను దుమ్ము, మడమలు పగిలిపోకుండా కాపాడుకోవడానికి చెప్పులు ధరిస్తాం. కానీ కంటికి కనిపించని అనేక బ్యాక్టీరియాలను కూడా మన ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయని మర్చిపోతున్నాం.
అమెరికాలోని అరిజోనా యూనివర్శిటీలో మైక్రోబయాలజిస్ట్, ప్రొఫెసర్ అయిన డాక్టర్ చార్లెస్ గెర్బా మన చెప్పులలో ఉండే సూక్ష్మక్రిములపై ఒక ప్రత్యేకమైన అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో బూట్ల లోపల, వాటి అరికాళ్ళలో పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు. షూ వెలుపల సగటున 4,21,000 యూనిట్ల బ్యాక్టీరియా, లోపల 2,887 యూనిట్ల బ్యాక్టీరియా కనుగొన్నట్లు తెలిపారు.
కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంటి లోపల పేరుకుపోయిన మురికిలో మూడింట ఒక వంతు బయట నుండి వస్తుంది. ఇందులో ఎక్కువ భాగం మన చెప్పుల ద్వారా వస్తుంది. బయట ధరించే స్లిప్పర్ అన్ని రకాల ధూళి, జెర్మ్స్ క్యారియర్ కావచ్చు. అందుకే ఈరోజు మనం ఇంట్లో బూట్లు, చెప్పులు ఎందుకు ధరించకూడదు అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందో..? దీనిపై సైన్స్ ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం.
Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?
పూర్వం ఇంట్లో చెప్పులు బయట విడిచి ఇంట్లోకి ప్రవేశించడం ఆనవాయితీ. ప్రత్యేక ఇంటి చెప్పులు లేదా బాత్రూమ్ చెప్పులు లేవు. చెప్పులు వేసుకోకుండా ఇంట్లోనే ఉండేవారు. కానీ ఈరోజుల్లో ఇంట్లో కూడా చెప్పులు వేసుకోవడం ఒకరకంగా ఫ్యాషన్ అయిపోయింది. బెడ్ రూమ్ కోసం మృదువైన బొచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్, బాత్రూమ్ కోసం స్లయిడర్లు, తోట-గ్యాలరీ కోసం క్రోక్స్, వంటగది కోసం సాధారణ చెప్పులు వాడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇంట్లో చెప్పులు ఎందుకు ధరించకూడదు?
బయట లేదా ఇంటి పాదరక్షలు, రెండూ ఇంటి లోపల ధరించకూడదు. బయట పాదరక్షలు వేసుకుని ఇంట్లో సోఫాలో హాయిగా కూర్చునేవాళ్లు బయటి మురికిని తమతో పాటు తెచ్చుకుంటున్నారనే విషయాన్ని మర్చిపోతారు. బూట్లు ధరించడం వల్ల బ్యాక్టీరియా, అనేక హానికరమైన రసాయనాలు, ధూళి వంటి అనేక మంది ఆహ్వానం లేని అతిథులు అనారోగ్య కారకులు మీ ఇంటికి చేరుకుంటాయి. మురికిని వ్యాపింపజేసే ఈకోలి అనే బ్యాక్టీరియా మన బూట్లలో ఎక్కువగా కనిపిస్తుందని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ ఉటా హెల్త్‌కి చెందిన శిశువైద్యుడు సిండి గెల్నర్ చెబుతున్నారు. షూస్ టాయిలెట్ ఫ్లోర్, బాహ్య వాతావరణం నుండి ఈ బ్యాక్టీరియాతో సంబంధంలోకి వస్తాయి, తరువాత వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు.