Site icon HashtagU Telugu

Software Employees: హైద‌రాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!

Software Employees

Software Employees

Software Employees: హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు (Software Employees) సంబంధించిన ఆందోళన కలిగించే ఆరోగ్య సమస్యల గురించి కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల ఒక ప్రకటనలో వెల్లడించారు. సుదీర్ఘ గంటలు కూర్చొని పనిచేయడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల ఐటీ ఉద్యోగుల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఐటీ ఉద్యోగుల‌ను ఇబ్బంది పెడుతున్న‌ మూడు ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం!

ఫ్యాటీ లివర్ (Fatty Liver)

కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఐటీ ఉద్యోగుల్లో 84% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని ఈ నివేదిక చెబుతోంది. సాధారణంగా మన శరీరంలో కాలేయం కొవ్వును ప్రాసెస్ చేస్తుంది. కానీ శరీరంలో అధిక కొవ్వు లేదా అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయం ఆ కొవ్వును సమర్థవంతంగా ప్రాసెస్ చేయలేకపోతుంది. అప్పుడు ఆ కొవ్వు కాలేయంలోనే పేరుకుపోతుంది.

కారణాలు

ఫ్యాటీ లివర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించకపోతే అది కాలేయ వాపు (Liver Inflammation), కాలేయ కణజాలం గట్టిపడటం (Fibrosis) లేదా కాలేయం పనితీరు పూర్తిగా దెబ్బతినే (Cirrhosis) ప్రమాదం ఉంది. ఇది కాలేయ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు.

ఊబకాయం (Obesity)

ఈ నివేదిక ప్రకారం.. 71% ఐటీ ఉద్యోగులు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం అంటే శరీరంలో సాధారణం కన్నా ఎక్కువ కొవ్వు పేరుకుపోవడం. ఇది కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు.. అనేక ఆరోగ్య సమస్యలకు మూల కారణం.

కారణాలు

ఐటీ ఉద్యోగుల్లో 34% మందికి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్య ఉంది. ఇది ఒకేసారి అనేక ఆరోగ్య సమస్యలు కలగలిపి వచ్చే ఒక పరిస్థితి. సాధారణంగా ఈ సిండ్రోమ్‌లో ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.

Also Read: Kingdom : విజయ్ సినిమా చూసేందుకు రష్మిక ఎలా వెళ్లిందో తెలుసా..?

ఈ లక్షణాలన్నీ కలిపి ఉన్నప్పుడు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.