Vastu Tips : నిద్రించేటప్పుడు ఈ 5 వస్తువులు మీ దరిదాపుల్లో కూడా ఉండకూడదు..!!

నిద్రించేటప్పుడు వాస్తుప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. నిపుణులు కూడా చెప్పేది అదే. వారి అభిప్రాయం ప్రకారం...నిద్రించేటప్పుడు కొన్ని వస్తువులను తలకు దగ్గరగా ఉంచకపోవడమే మంచింది.

  • Written By:
  • Publish Date - July 10, 2022 / 07:00 AM IST

నిద్రించేటప్పుడు వాస్తుప్రకారం కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. నిపుణులు కూడా చెప్పేది అదే. వారి అభిప్రాయం ప్రకారం…నిద్రించేటప్పుడు కొన్ని వస్తువులను తలకు దగ్గరగా ఉంచకపోవడమే మంచింది. ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. మంచి నిద్ర అలసటను దూరం చేస్తుంది. కాబట్టి మానసికంగా, శారీరక శ్రేయస్సు కోసం నిద్ర అనేది చాలా ముఖ్యం. అయితే నిద్రించేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను తలకు దూరంగా ఉంచుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

వాలెట్ లేదా పర్సు :
వాస్తుశాస్త్రం ప్రకారం…రాత్రి పడుకునేటప్పుడు మీ తల దగ్గర వాలెట్ పెట్టుకోవద్దు. పర్సులో డబ్బు ఉంటుంది. ఫలితంగా నిద్రవేళలో తల ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది శాంతి కంటే ఎక్కువ అశాంతికి దారి తీస్తుంది. డబ్బు గురించే ఆలోచిస్తుంటే నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి పర్సును అల్మారా లేదా భద్రంగా ఏదైనా స్థలంలో పెట్టుకోవడం మంచిది. ఇలా చేస్తే డబ్బు చింతకు దూరంగా ఉండవచ్చు.

గొలుసు లేదా తాడు :
రాత్రి నిద్రించే ముందు మనం ఎప్పుడు కూడా తాడు లేదా గొలుసును తల దగ్గర ఉంచకూడదు. ఇలా చేస్తే వారి జీవితంలో అడ్డంకులు ఎప్పటికీ తగ్గవు. కెరీర్ లో విఫలం అవుతుంటారు. చేపట్టిన పనులు పూర్తికాక ఎన్నో కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది.

వార్తాపత్రిక, మ్యాగజైన్ లేదా పుస్తకం:
మీరు ప్రతి రాత్రి మీ దిండు కింద పుస్తకం, వార్తాపత్రిక లేదా మ్యాగజైన్‌ని ఉంచుకుని నిద్రపోతే, వీలైనంత త్వరగా ఈ తప్పును సరిదిద్దుకోండి. ఇలాంటి వాటిని తల కింద పెట్టుకోవడం వల్ల జీవితంలో నెగెటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుంది. అలాంటి వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు.

వాటర్ బాటిల్:
చాలా మంది వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని పడుకుంటారు. అయితే అది మన జీవితంపై చాలా చెడు ప్రభావం చూపుతుంది. ఇలా చేసేవారి ఏకాగ్రత ఎప్పుడూ చెదిరిపోతుంది. మానసిక ఒత్తిడి వ్యక్తిని చుట్టుముడుతుంది.

ఆధునిక పరికరాలు :
రాత్రి పడుకునేటప్పుడు వాచ్, ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వంటి పరికరాలను కూడా తలపై పెట్టుకోకూడదు. నిద్రపోయేటప్పుడు తలపై అలాంటివి ఉండకూడదని ఇది ప్రతికూలతను పెంచుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇది డబ్బు నష్టానికి దారితీయడమే కాకుండా జీవితంలోని ప్రతి రంగంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.