Reliance Foundation: చదువుకోవాలన్న ఆసక్తి, గొప్పస్థాయికి ఎదగాలనుకునే వారికి ప్రముఖ డిజిటల్ సంస్థ రిలయన్స్ అండగా నిలవనుంది. చదువుకోవాలని ఉన్నా కొందరికి ఆర్థిక స్థోమత సహరించనందున ఎంతో మంది విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు.అలాంటి వారికోసం రిలయన్స్ సహాయం చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలలో నిర్వహిస్తున్న వివిధ అండర్ గ్రాడ్యుయేట్ (UG) మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) స్థాయి కోర్సుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ 5000 UG స్కాలర్‌షిప్‌లు మరియు 100 PG స్కాలర్‌షిప్‌లను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్ కోసం గరిష్టంగా రూ. 2 లక్షలు మరియు PGకి గరిష్టంగా రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌గా నిర్ణయించింది.
రిలయన్స్ ఫౌండేషన్ అందించే UG మరియు PG స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. తమ ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్ కోసం చూస్తున్న విద్యార్థులు ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పోర్టల్.reliancefoundation.orgని సందర్శించడం ద్వారా తమ దరఖాస్తును సమర్పించవచ్చు. స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2023 అని విద్యార్థులు గమనించాలి. దరఖాస్తు చేయడానికి ముందు విద్యార్థులు UG మరియు PG స్కాలర్‌షిప్‌లకు సూచించిన అర్హత పరిస్థితులను తెలుసుకోవాలి.
రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ పోర్టల్ ప్రకారం దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలో ఈ సంవత్సరం ఏదైనా కోర్సులో చేరిన మొదటి సంవత్సరం/సెమిస్టర్ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా పీజీ కోర్సులకు పీజీ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రెండు స్కాలర్‌షిప్‌ల గురించి మరింత సమాచారాన్ని చూడవచ్చు.
Also Read: Tamilnadu: నాటు బాంబు కొరికిన ఏనుగు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?