Site icon HashtagU Telugu

Relationship : ఈ 10 విషయాలు చేయకపోతే అతను నీ వాడు కాదన్నట్టే లెక్క..!

He’s Not Your Forever Person If He Doesn’t Do These 10 Things

He’s Not Your Forever Person If He Doesn’t Do These 10 Things

Relationship రిలేషన్ షిప్ లో భాగస్వామి తమని ఎంత ప్రేమిస్తున్నాడు ఎంత అర్ధం చేసుకుంటున్నాడు అన్న విషయంలో కొన్ని సమీకరణాలు ఉంటాయి. ఈ క్రమంలో ఒక వ్యక్తి నిజంగానే ఇష్టపడితే అతను ఈ 10 విషయాలను చేస్తూ ఉంటాడు. ఇవి చేయకపోతే మాత్రం అతను నీ నుంచి దూరం అవుతున్నాడని అర్ధం.

We’re now on WhatsApp : Click to Join

1. తరచు కమ్యునికేషన్ లో ఉండటం

కేవలం మీ పక్కన ఉన్నప్పుడే కాదు మీకు దూరంగా ఉన్న సమయాల్లో కూడా కమ్యునికేషన్ లో ఉండటం. ప్రతి విషయంలో మీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటాడు. రిలేషన్ షిప్ లో ప్రాపర్ కమ్యునికేషన్ అనేది చాలా అవసరం అది రెగ్యులర్ గా ఉంటుంది అంటే అతను మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే లెక్క.

2. కలలకు ప్రోత్సాహం అందించడం

భాగస్వామి ఎప్పుడైతే మీ కలలకు ప్రోత్సాహం అందిస్తున్నారో వారికి మీరంటే చాలా స్పెషల్ అని గుర్తించాలి. మీ ఆశయాలు, కలలను ప్రోత్సహించే వారు మీకు ఎప్పుడూ తోడుగా ఉండాలని కోరుతారు. వారు మిమ్మల్ని ఎప్పటికి విడిచి వెళ్లారని అనుకోరు.

3. ఎప్పటికి రెస్పెటబుల్ గా ఉండటం మీ బౌండరీస్ ని గుర్తించడం

మీతో ఎప్పటికీ బాధ్యాతాయుతంగా ఉంటారు. మీ బౌండరీస్ గుర్తించి వాటికి విలువ ఇస్తాడు. రెస్పాన్సిబుల్ గా ఉండటం అనేది చాలా అవసరం.

4. బాధ్యతలను పంచుకోవడం

మీ బాధ్యతలను కూడా వారు సంతోషంగా పంచుకుంటారు. అలాంటి వారికి మీ మీదే ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నట్టే అని గుర్తించాలి.

5. క్వాలిటీ టైం ఇన్వెస్ట్ చేయడం

మీతో గడిపే సమయాన్ని చాలా ఆహ్లాదకరంగా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు. వారికున్న టైం లోనే మీతో గడిపేందుకు ఇష్టపడతారు. అలాంటి వారు మీకు అసలు దూరం అవ్వాలని అనుకోరు.

6. ఓపెన్ అండ్ హానెస్ట్ కమ్యునికేషన్

నిజమైన నిజాయితీ కలిగిన కమ్యునికేషన్ కలిగి ఉంటారు. ఏదైనా సరే దాచుకోకుండా ఓపెన్ గా అన్నీ మాట్లాడగలుగుతారు. ఇలా ఉన్న భాగస్వామి మీతో ఎప్పటికి కలిసి ఉండాలని అనుకుంటారు.

Also Read : Relationship : భాగస్వామి విడిపోయేందుకు రెడీగా ఉన్నారని చెప్పే 9 సంకేతాలు..!

7. అర్ధం చేసుకుని ఉండటం

మిమ్మల్ని బాగా అర్ధం చేసుకుని ఉండే వారు కూడా మీతో ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుతారు. అర్ధం చేసుకుని ఉండటం కూడా ఒక మంచి విషయమే. రిలేషన్ షిప్ లో అండర్ స్టాండింగ్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది.

8. వ్యక్తిగత వృద్ధి కోరడం

భాగస్వామి తనతో పాటు మీ వ్యక్తిగత వృద్ధిని కూడా కోరుకుంటాడు. మీ అభివృద్ధి కోసం కావాల్సిన సహకారాన్ని కూడా అందిస్తారు. అలాంటి వారు దొరకడం అదృష్టం గా భావించాల్సి ఉంటుంది.

9. అంకితభావం తో ఉండటం

మీతో ఎప్పుడు ప్రేమగా అంకితం భావంగా ఉండటం కూడా మీ భాగస్వామి మీకు ఇస్తున్న విలువ అని గుర్తించాలి. అలాంటి వ్యక్తులు మీ నుంచి అసలు దూరం అవ్వాలని అనుకోరు.

10. విలువలు ఇస్తూ గోల్స్ గురించి చర్చించడం

మీకు వాల్యూ ఇస్తూ మీ గోల్స్ గురించి చర్చించి వాటికి కావాల్సిన సపోర్ట్ అందించడం కూడా భాగస్వామి చేస్తుంటాడు. కేవలం తన అభివృద్ధి మాత్రమే కాకుండా మీ గోల్స్ గురించి కూడా ఆలోచించడం మంచి విషయం.