Fruits : పండ్లు తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..!

శరీరానికి అవసరమయ్యే పోషకాలు (Nutrients) అన్నీ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు (Vitamins),

ప్రతి రోజూ పండ్లు (Fruits) తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శరీరానికి అవసరమయ్యే పోషకాలు (Nutrients) అన్నీ పండ్లలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు (Vitamins), మినరల్స్ (Minerals), యాంటీ-ఆక్సిడెంట్స్ (Anti-Oxidants), ఫైబర్ (Fiber), కార్బోహైడ్రేట్స్ (Carbohydrates) వంటివి పండ్ల ద్వారా లభిస్తాయి. అధిక బరువుతో (Weight) ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా పండ్లును (Fruits) ఆహారంగా తీసుకోమని కూడా వైద్యులు (Doctors) సూచిస్తుంటారు.

అయితే, పండ్లు (Fruits) తింటే ఎంత మేలు జరుగుతుందో, సరైన రీతిలో తీసుకోకపోతే అంతే నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు (Experts) హెచ్చరిస్తున్నారు. పండ్లు (Fruits) తినే విషయంలో ప్రజలు చాలా తప్పులు చేస్తున్నారని ప్రముఖ డైటీషియన్ (Dietitian) డాక్టర్ అర్చన బాత్రా (Dr. Archana Batra) హెచ్చరించారు. పండ్లు (Fruits) తీసుకొనే విషయంలో ఆమె చేసిన సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం..

పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం:

పిల్లలతో పాటు పెద్దలకు కూడా పండ్లు తిన్న వెంటనే నీళ్లు (Water) తాగే అలవాటు ఉంటుంది. పండ్లు తిన్నవెంటనే నీళ్లు తాగడం వల్ల డైజెస్టివ్ సిస్టంలోని (Digestive System) PH లెవెల్ (PH Level) అన్‌బ్యాలెన్స్‌ అవుతుంది. ముఖ్యంగా నీటి శాతం (Water Percentage) అధికంగా ఉండే పుచ్చకాయ (Watermelon), దోసకాయ (Cucumber), నారింజ (Orange), స్ట్రాబెర్రీ (Strawberry), కీరదోస వంటి పండ్లు తిన్నప్పుడు శరీరంలోని ఎసిడిటీ తగ్గి PH బ్యాలెన్స్ మారుతుంది. దీనివల్ల కలరా (Cholera), డయేరియా (Diarrhea) వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అర్చన బాత్రా (Archana Batra) తెలిపారు.

పండ్లు తొక్క తీసి తినడం:

చాలా మందికి అన్ని రకాల పండ్లకు తొక్క తీసి తినడం అలవాటుగా మారింది. శరీరానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్లు అందించడంలో పండ్ల తొక్కలు కీలకపాత్ర పోషిస్తాయి. యాపిల్‌ తొక్కలోనే అధిక శాతం ఫైబర్, విటమిన్ A, విటమిన్ C ఉంటాయని అర్చన బాత్రా పేర్కొన్నారు. కొన్ని రీసెర్చ్‌లు కూడా పండ్లు తొక్కతో తినడం వల్ల ఉబకాయం, క్యాన్సర్ వంటి సమస్యలు అధిగమించవచ్చని తేలింది.

రాత్రి వేళల్లో పండ్లు తినడం:

రాత్రి పడుకునే రెండు, మూడు గంటల ముందు నుంచి ఏమీ తినకపోవడం శరీరానికి మంచిది. దీనికి పండ్లు కూడా అతీతం కాదు. రాత్రి పడుకునే ముందు పండ్లు తినడం వల్ల అధికంగా షుగర్‌ రిలీజ్‌ అయి, డైజెస్టివ్ సిస్టం దెబ్బతింటుంది, అలానే నిద్ర కూడా లోపిస్తుంది. దీంతోపాటు అదనంగా అజీర్తి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల పండ్లను స్నాక్స్ గా తీసుకోవడం తప్పిస్తే పడుకునే ముందు తినకూడదని చెప్పారు.

పండ్లను ఇతర పదార్థాలతో కలిపి తినడం:

పండ్లు ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే త్వరగా జీర్ణం అవుతాయి. కానీ పండ్లను వేరే ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నప్పుడు జీర్ణమవడం కష్టమవుతుంది. దీంతో ఆమ (Ama) అనే టాక్సిన్స్ (Toxins) కడుపులో ఉత్పత్తి అవుతాయి. దీంతో అరుగుదల లోపించి తిన్న ఆహారం శరీరంలో ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పోషకాలు శరీరానికి అందవు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల పండ్లను విడిగా తినడం మంచిదని సూచించారు.

Also Read:  Dry Fruits Health Benefit: పాలల్లో ఎండు ద్రాక్ష ఉడికించి తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?