పిగ్మెంటేషన్ (Pigmentation) అనేది ముఖ చర్మంపై కనిపించే నల్లటి మచ్చల రూపంలో ఉండే సాధారణ సమస్య. ఇది ముఖ్యంగా యుక్త వయస్సులో హార్మోన్ల మార్పులు, శరీరంలోని కొన్ని ఆర్ధిక లోపాలు, మానసిక ఒత్తిడి, సూర్యరశ్ముల ప్రభావం వల్ల కలుగుతుంది. ముఖ్యంగా నుదురు, బుగ్గలపై కనిపించే ఈ మచ్చలు ముఖకాంతిని తగ్గిస్తాయి. అయితే, ఇంట్లోనే సులభంగా లభించే సహజ పదార్థాలతో ఈ సమస్యను కొంతవరకూ తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పుదీనా ఆకుల పేస్ట్, సోయాపాలు-నిమ్మరసం మిశ్రమం, కలబంద గుజ్జుతో చేసిన ప్యాక్ వంటి చిట్కాలు చర్మాన్ని శుభ్రపరిచే గుణాలను కలిగి ఉంటాయి. అలాగే కమలాపండు పొడి, ఓట్‌మీల్, పెరుగు, టమాటా రసం వంటి పదార్థాలు సహజ బ్లీచింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్ గుణాలతో చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఈ చిట్కాలను నిరంతరం పాటించడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి, ముఖ కాంతి పెరుగుతుంది. అయితే, ఈ పదార్థాలు కొన్ని చర్మాలకు సరిపోకపోవచ్చు కాబట్టి వాడే ముందు ఒకసారి పరీక్షించుకోవడం ఉత్తమం.
Office : మీరు ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా..? అయితే ఇలా చెయ్యండి
ఇంకా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా పిగ్మెంటేషన్ సమస్యను ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పండ్లు, బీన్‌లు, బెర్రీస్ వంటి పదార్థాలను ఆహారంలో చేర్చడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. సన్‌స్క్రీన్ లోషన్ల వినియోగం, ముఖాన్ని సరిగా కవర్ చేసుకోవడం కూడా సూర్యరశ్ముల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ చిట్కాలను పాటించే ముందు డెర్మటాలజిస్ట్ లేదా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.