Healthy Breakfast : ఓట్స్ తో గుంత పునుగులు.. డైట్ చేసేవారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్

ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా గుంత పునుగులు చేయాలనుకున్నారా ? ఓట్స్ తో కూడా గుంతపునుగులు చేసుకోవచ్చని తెలుసా ? ఓట్స్ తో డైట్ చేయాలి.. అలాగే ఇలాంటి రెసిపీలు కూడా తినాలనుకునేవారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 08:19 PM IST

Oats Gunthapunugulu Recipe : గుంత పునుగులను సాధారణంగా మినపప్పుతో తయారు చేసిన పిండితో చేస్తారు. మినపప్పు, బియ్యం, రవ్వ కలిపి చేసిన పిండితో గుంతపునుగులు చేసుకుని.. టొమాటో చట్నీ, పల్లీ చట్నీ నంచుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. కానీ.. ఎప్పుడైనా కాస్త డిఫరెంట్ గా గుంత పునుగులు చేయాలనుకున్నారా ? ఓట్స్ తో కూడా గుంతపునుగులు చేసుకోవచ్చని తెలుసా ? ఓట్స్ తో డైట్ చేయాలి.. అలాగే ఇలాంటి రెసిపీలు కూడా తినాలనుకునేవారికి ఇది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్. మరి ఆ ఓట్స్ గుంతపునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఓట్స్ – గుంతపునుగుల తయారీకి కావలసిన పదార్థాలు

ఓట్స్ – 1 కప్పు

బియ్యం పిండి – 1/4 కప్పు

సన్న రవ్వ – 1 టేబుల్ స్పూన్

ఉల్లిపాయ తరుగు – 1/4 కప్పు

పచ్చిమిర్చి తరుగు – 2 కాయలు

పెరుగు – 1/4 కప్పు

ఆవాలు – అర టీ స్పూన్

నూనె – కావలసినంత

ఓట్స్ గుంతపునుగుల తయారీ విధానం

ఓట్స్ ను పొడిచేసి పెట్టుకోవాలి. ఒక పాత్రలో ఓట్స్ పొడి, బియ్యంపిండి, రవ్వ, వంటసోడా, ఉప్పు, పెరుగు వేసుకుని.. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండి మాదిరిగా గట్టిగా కలుపుకుని పక్కనపెట్టుకోవాలి.

మరో చిన్న గిన్నె తీసుకుని నూనె వేడయ్యాక అందులో ఆవాలు వేసుకుని.. వేగిన తర్వాత మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక.. కలిపి పక్కన పెట్టుకున్న ఓట్స్ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇక్కడ నూనెకు బదులుగా తాలింపులో నెయ్యిని కూడా వేసుకోవచ్చు. మీకిష్టమైతే సన్నగా తరిగిన కూరగాయలను కూడా కలుపుకోవచ్చు.

స్టవ్ పై గుంత పొంగడాలు చేసే పెనాన్ని పెట్టుకుని ఆ గుంతల్లో కొద్దికొద్దిగా నూనె వేసుకుని.. పిండిని నిండుగా పోసుకుని.. మూతపెట్టుకుని మగ్గించుకోవాలి. కాస్త రంగుమారిన తర్వాత నూనెను వేసుకుని.. మరోవైపు కూడా కాల్చుకోవాలి.

Also Read : Periods: స్త్రీలు పీరియడ్స్ సమయంలో నొప్పి తట్టుకోలేక పోతున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే?