Site icon HashtagU Telugu

House Cleaning : బ్యాడ్ లక్ పోవాలంటే ఇంటిని క్లీన్ చేసుకోవలసిందే..

Must Clean House for Avoid Bad Luck

Must Clean House for Avoid Bad Luck

House Cleaning : మన ఇంటిలో ఎప్పుడూ చెత్తను ఉంచకూడదు. అలా ఉంటే అది మన దురదృష్టానికి(Bad Luck) సంకేతం. ఇంకా మనకు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి. అదేవిధంగా మన ఇంటిలో ఉండే సామాన్లను కూడా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక క్రమపద్ధతిలో ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వలన మనం శారీరకంగానూ, మానసికంగానూ ఆనందంగాను ఉంటాము. కొన్ని ప్రదేశాలను మాత్రం కచ్చితంగా శుభ్రంగా ఉంచుకోవాలి.

మన ఇంటి ముందు చెప్పులు, బూట్లు వంటి వాటిని పెట్టుకుంటూ ఉంటాము అయితే అవి చిందరవందరగా కాకుండా ఒక క్రమపద్ధతిలో ఉంటే మంచిది. అదేవిధంగా మన ఇంటి ముందు పూల మొక్కలను ఉంచితే అవి సువాసనలు వెదజల్లుతూ వచ్చిన వారికి ఆహ్వానం పలికే విధంగా ఉంటాయి. ఇంటి ముందు ఉండే డోర్ మ్యాట్, కాలింగ్ బెల్ వంటివి పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి.

బెడ్ రూమ్ లో కూడా అనవసరమైన వస్తువులను తొలగించాలి. బెడ్ రూమ్ పీస్ ఫుల్ గా ఉండడానికి పెర్ఫ్యూమ్ లేదా రూమ్ స్ప్రే చేయాలి. మనం రూమ్ లోకి రాగానే మనకు హ్యాపీగా అనిపించేలా చేసుకోవాలి. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది.

వంట గదిని ఎప్పుడూ నీట్ గా ఉంచుకోవాలి. లేకపోతే మనకు ఆరోగ్య సమస్యలు, జీర్ణ సమస్యలు, ఆర్ధిక సమస్యలు వస్తాయి. వంట గదిలో పాడైపోయిన ఆహారాన్ని పడెయ్యాలి. పాత వంట సామాన్లను ఉంచకూడదు. వంటగదిలో తాజా కూరగాయలు, పండ్లు, పూవులు ఉంచాలి. అప్పుడే మనకు వంటగదిలో పీస్ ఫుల్ గా ఉంటుంది.

లివింగ్ రూమ్ ఉన్నట్లైతే ఆ రూమ్ లో పాత వస్తువులను, పాత పేపర్లను ఉంచకూడదు. ఆ రూమ్ లో పెయింటింగ్స్ గాని ఏవైనా మంచి పుస్తకాలను గాని ఉంచాలి. ఈ విధంగా మన ఇంటిని క్లీన్ గా ఉంచుకోవడం వలన మనకు మన మనసు ప్రశాంతంగాను, ఆరోగ్యంగాను ఉండటమే కాక బ్యాడ్ లక్ కు మనల్ని దూరంగా ఉంచుతుంది. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మి దేవి వస్తుందని మన పూర్వికులు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే బ్యాడ్ లక్ కి దూరంగా ఉండాలంటే ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

 

Also Read : Mango Peel Tea : మామిడి తొక్కలతో టీ తాగారా? ఎలా తయారు చేయాలంటే.. ప్రయాజనాలు..