Site icon HashtagU Telugu

Rainy season : వ‌ర్షాకాలంలో కాళ్లకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ..ఈ చెప్పులు ధరించాల్సిందే !!

Monsoon Footwear Tips To Ch

Monsoon Footwear Tips To Ch

వర్షాకాలం (Rainy season) రాగానే మట్టిబారిన రోడ్లు, నీరు నిలిచే ప్రదేశాలు, తడిగా మారే వీధులు సర్వసాధారణం. ఈ పరిస్థితుల్లో పాదాలు తడవడం, జారిపడే ప్రమాదాలు, ఫంగస్‌ వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి. కాబట్టి, ఈ సీజన్‌లో పాదాలను రక్షించేందుకు సరైన చెప్పులను (Footwear ) ఎంచుకోవడం అత్యంత అవసరం. మెటీరియల్, సౌకర్యం, గ్రిప్‌, వాటర్‌ప్రూఫ్‌ లక్షణాలు వంటి ఉన్న చెప్పులు ధరించాల్సి ఉంటుంది.

వర్షాకాలంలో లెదర్‌, స్వెడ్‌, ఫ్యాబ్రిక్‌ వంటి తేమ పీల్చుకునే చెప్పులు మానేసి, వాటర్‌ప్రూఫ్‌ మెటీరియల్స్‌తో తయారైన చెప్పులను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిగా ఉన్న రోడ్డుపై కూడా జారకుండా ఉండేందుకు మంచి గ్రిప్ కలిగిన సోల్స్‌ను ఎంచుకోవాలి. ఫ్లిప్‌ ఫ్లాప్స్‌, లైట్ వెయిట్ సాండల్స్‌ వంటి సాధారణ వర్షాకాల ఫుట్‌వేర్‌ రోజువారీ వాడకానికి సరైనవిగా భావిస్తున్నారు. ఇవి త్వరగా ఆరిపోవడంతో పాటు శుభ్రంగా ఉంచుకోవడం సులభం.

Sleeping Amenia : స్లీపింగ్ అమ్నియాతో బాధపడుతున్నారా? దీని లక్షణాలు మీలో ఉన్నాయా? చెక్ చేసుకోండి

రబ్బర్‌, సిలికాన్‌ వంటి మెటీరియల్స్‌తో తయారైన క్లాగ్స్‌ మరియు వాటర్‌ప్రూఫ్‌ షూస్‌ వర్షకాలంలో పాదాలకు పూర్తి రక్షణ కల్పిస్తాయి. వీటిలో గాలి ప్రసరణకు అవకాశం ఉండటం వలన తేమ నిల్వ ఉండదు. క్రోక్స్‌ వంటి బ్రాండ్‌ల క్లాగ్స్‌ తేలికగా ఉండటంతో పాటు మంచి గ్రిప్‌ను కలిగి ఉండటంతో యువత, విద్యార్థుల మధ్య ప్రాచుర్యం పొందాయి. అలాగే నైలాన్‌, సింథటిక్‌ మెటీరియల్స్‌తో చేసిన వాటర్‌ప్రూఫ్‌ షూస్‌ ఎక్కువ సేపు బయట నడవాల్సినవారికి సరైన ఎంపిక.

రోజువారీ వాడకానికి రబ్బర్ బ్యాలెట్ ఫ్లాట్స్, స్లిప్పర్లు కూడా సరైన ఎంపిక. ఇవి శుభ్రం చేయడం సులభం, తడినా త్వరగా ఆరిపోతాయి, పాదాలను బురద నుండి కొంతవరకు రక్షిస్తాయి. వర్షాకాలంలో స్టైల్‌కి బదులు ఆరోగ్యాన్ని ముందుగా పట్టించుకోవాలి. సరైన చెప్పుల ఎంపిక ద్వారా కాళ్లకు ఫంగస్‌, ఇన్ఫెక్షన్లు, జారిపడి గాయాల నుంచి రక్షణ పొందవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే, వర్షాకాలంలో “బ్యూటీ కన్నా సేఫ్టీ ముఖ్యం” అన్న నియమం పాటించడం చాలా అవసరం.