Love : ప్రేమ (లవ్).. ఇదో గొప్ప భావన. ప్రేమ అనే పవిత్ర బంధం మనిషికి పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. మెదడులో అందమైన ఆలోచనలకు పురుడుపోస్తుంది. లవ్ అనే పదాన్ని విన్న తర్వాత మనిషి మెదడులో ఏం జరుగుతుంది ? మెదడు నుంచి ఎలాంటి రియాక్షన్లు వస్తాయి ? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫిన్‌లాండ్‌కు చెందిన ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేశారు. ఫంక్షనల్ మేగ్నటిక్ రీజోనెన్స్ ఇమేజింగ్ (ఎఫ్ఎంఆర్ఐ) టెక్నాలజీతో నిర్వహించిన ఈ పరిశోధనలో గుర్తించిన ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ప్రేమ(Love) చాలా రకాలుగా ఉంటుంది. పేరెంట్స్, బంధువులు, ప్రేయసిని ప్రేమించే వారు ఎలాగైతే ఉంటారో.. డబ్బు, ఆస్తిపాస్తులు, పెంపుడు కుక్కలను ప్రేమించే వారు కూడా అలాగే ఉంటారు. ఈవిధంగా ప్రేమను 6 కేటగిరీలుగా వర్గీకరించి వాటిపై రీసెర్చ్ చేశామని ఆల్టో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. రీసెర్చ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కు చెందిన సెరెబ్రల్ కార్టెక్స్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.
- లవ్ గురించి ఆలోచించగానే మెదడు నుంచి పాజిటివ్ సిగ్నల్స్ రిలీజ్ అవుతాయని రీసెర్చ్‌లో గుర్తించారు. వీటిలో ఎమోషన్‌ను కలిగించే సందేశాలు దాగి ఉంటాయని తెలిపారు.
- లవ్ గురించి ఆలోచన రాగానే నుదుటి మధ్య ఉండే లైన్ భాగంలో స్పందన మొదలవుతుంది. మెదడులోని బేసల్ గాంగ్లియా, తల వెనుక భాగంలో ఉండే టెంపోరోపారిటల్ జంక్షన్ భాగాలు కూడా రియాక్ట్ అవుతాయి.
- లవ్ అనే పదం వల్ల మెదడులోని ఏయే భాగాలు ఎలా స్పందిస్తున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
- తల్లిదండ్రుల ప్రేమ గురించి ఎవరైనా ఆలోచిస్తే.. మెదడు లోపలి భాగంలో ఉండే స్ట్రియాటమ్‌లో మధురానుభూతి కలుగుతుందట. ఫలితంగా పేరెంట్స్‌తో తమకున్న అనుబంధం కళ్లెదుట కదలాడుతుంది.
- అయితేే అన్ని రకాల ప్రేమలకు మెదడు నుంచి రియాక్షన్ ఒకేలా లేదని ఈ రీసెర్ఛ్‌లో గుర్తించారు.