Site icon HashtagU Telugu

Kova Kajjikaya: ఎంతో టేస్టీగా ఉండే కోవా కజ్జికాయలు.. ఇంట్లోనే చేసుకోండిలా!

Kova Kajjikaya

Kova Kajjikaya

మనం ఇంట్లో రకరకాల కజ్జికాయలు చేసుకుని తింటూ ఉంటాం. బెల్లం కజ్జికాయలు చక్కెర కజ్జికాయలు, పప్పుల పిండి కజ్జికాయలు అంటూ రకరకాల కజ్జికాయలు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా కోవా కజ్జికాయలు తిన్నారా. ఒక వేరే తినకపోతే బేకరీ స్టైల్ లో ఈ కోవా కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join
కావలసిన పదార్థాలు :-

మైదాపిండి – అరకిలో
పంచదార – కిలో
పాలకోవా – పావుకిలో
జాపత్రి – 2 గ్రాములు
యాలకులు – 2 గ్రాములు
శనగపిండి – 50 గ్రాములు
వంట సోడా – పావు స్పూను
బేకింగ్ పౌడర్ – పావుస్పూను
నెయ్యి – 100 గ్రాములు
ఆయిల్ – తగినంత

Also Read: Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?

తయారు విధానం :

ముందుగా శనగపిండిలో కోవా కలిపి కొంచెం వేయించి దించాలి. దానిలో జాపత్రిపొడి, యాలకులపొడి, కొంచెం పంచదార కలిపి ముద్దగా చేయాలి. బాణలిలో మిగిలిన పంచదార పోసి, 2 గ్లాసులు నీళ్ళు పోసి లేత పాకం వచ్చేవరకూ ఉంచి దించాలి. మైదాపిండిలో వంట సోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించాలి. అందులో కరగబెట్టిన నెయ్యి కలిపి నీళ్ళు చేర్చి గట్టి ముద్దలా చేయాలి. నిమ్మకాయంత ముద్దలను తీసుకుని పూరీలా, కొంచెం మందంగా ఒత్తి మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి అర్ధచంద్రాకారంలో మూసి, అంచులను తడిచేసి, కోవాకు దగ్గరగా చుట్టి కజ్జికాయలు చేయాలి. వీటిని నూనెలో వేయించి కొంచెం రంగు రాగానే తీసి, పంచదార పాకంలో వేసి ముంచి తీస్తే సరి, నోరూరించే కోవా కజ్జికాయలు రెడీ.

Also Read: Anupama Parameswaran: చీరకట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న అనుపమ.. ఇదే మాకు కావాల్సింది అంటూ?