Site icon HashtagU Telugu

Millionaire : శనివారం రోజు ఈ ఐదు రకాల నియమాలు పాటిస్తే చాలు.. కోటీశ్వరులు అవ్వడం కాయం..

millionaire

Just Follow These Five Types Of Rules On Saturday.. You Will Not Become Millionaires

How to become a millionaire : మనలో చాలామంది శనీశ్వరుడు పేరు వినగానే భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని ఆలయాలకు వెళ్లాలి అన్నా, శని దేవుని ప్రార్థించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కాగా శనీశ్వరుడు న్యాయదేవుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మనం చేసే మంచి పనులు చెడ్డ పనులను బట్టి శనీశ్వరుడు కష్టాలను సుఖాలను అందిస్తాడు. అయితే శనీశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి బీదవారు కోటీశ్వరులు (millionaire) అవుతారు. అందుకోసం శనీశ్వరుని తప్పకుండా పూజించాల్సిందే. కానీ శనీశ్వరుని పూజించే సమయంలో ఆరాధించే సమయంలో కొన్ని రకాల సూచనలను నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మహిళలు, పురుషులు శని దేవతకు సమానంగా పూజలు చేయాలి. శనీశ్వరుడిని పూజించేటప్పుడు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. అదేమిటంటే ఇతర దేవుళ్ళ మాదిరిగా శని దేవతను ముట్టుకోకూడదు. అలా శనీశ్వరుడిని తాకే హక్కు కేవలం ఆలయంలోని పూజారికి మాత్రమే ఉంటుంది. ఇక ప్రతి శనివారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దాంతో పాటు ఆవులకు అన్నం పెట్టాలి. రావిచెట్టు కింద నల్ల నవ్వులు వేసి గానుగ నూనెతో దీపం వెలిగించాలి. శనివారం రోజు గుడికి వెళ్లి ఆంజనేయస్వామిని పూజించాలి. శనిశ్వరుడికి ఇష్టమైన ఆహారం కిచిడి అందుకే శని దేవుడికి కిచిడీ ప్రసాదంగా సమర్పించాలి. దాంతో పాటు కిచిడీ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి.

అలా చేస్తే కోరిన వరాలు కూడా ఇస్తాడు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రతి శనివారం నాడు స్నానం చేసిన తరువాత అత్యంత భక్తి శ్రద్ధలతో శని దేవుడిని ఆరాధించాలి. అలాగే శని చాలీసా మంత్రాన్ని పఠించాలి. మరీ ముఖ్యంగా సుందరకాండను తప్పకుండా చదవాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా శనివారం రోజు కాకులకు ఆహారాన్ని పెట్టాలి. ఇలా చేయడం వల్ల మన పూర్వీకులు కూడా సంతృప్తి చెందుతారు. శనివారం రోజు నల్ల చెప్పులు నల్లగొడుగు నల్ల బట్టలు నల్ల మినప పప్పు దానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ ఐదింటిని పాటించడం వల్ల తప్పకుండా శని అనుగ్రహం కలుగుతుంది. శనీశ్వరుడి అనుగ్రహం కలిగింది అంటే చాలు ఎంతటి పేదవారు అయినా కూడా కోటీశ్వరులు (millionaire) అవ్వాల్సిందే. అలాగే శని కటాక్షంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతులేని ధనం కూడా లభిస్తుంది.

Also Read:  WhatsApp Update : వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై మెసేజ్‌ స్క్రీన్‌పైనే స్టేటస్‌ అప్‌డేట్స్‌.. అదెలా అంటే?