Jeans Effect in Summer : జీన్స్.. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎక్కువగా వీటినే వాడుతున్నారు. సమ్మర్ లో కూడా ఎక్కువగా జీన్స్ నే వాడుతుంటారు. సాధారణంగానే వేసవిలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాంటి వేసవిలో జీన్స్ ధరిస్తే.. చర్మ సమస్యలు తప్పవంటున్నారు. చర్మానికి గాలి తగిలేలా.. వదులుగా ఉన్న దుస్తులు వేసుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు.
టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల చర్మంపై అలెర్జీలు, దద్దుర్లు, తామర వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శరీరానికి గాలి తగలకుండా నిరోధిస్తాయి. చర్మంపై చెమట అలా ఉండిపోవడంతో శిలీంధ్రాలు పెరగడానికి కారణమవుతాయి. రోజులో ఎక్కువ సమయం టైట్ గా ఉండే జీన్స్ వేసుకోవడం వల్ల చెమట, వేడి కలిసి చర్మ కణాలపై ఇన్ఫెక్షన్, అలెర్జీని కలిగిస్తాయి.
ఒకసారి వేసుకున్నాక జీన్స్ ను వాష్ చేయరు. ఇది కూడా చర్మ సంబంధిత సమస్యలకు కారణం. చెమట వల్ల జీన్స్ కు అంటుకున్న ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఒక్కసారి ఉతకగానే పోవు. నాలుగైదు సార్లైనా ఉతకాల్సి ఉంటుంది. అప్పుడే జీన్స్ పై ఉన్న ఫంగస్, వైరస్, బ్యాక్టీరియా తొలగిపోతాయి.
వేసవిలో జీన్స్ ను వీలైనంత వరకూ వేసుకోకపోవడం మంచిది. వదులుగా, శరీరానికి గాలి తగిలేలా ఉండే దుస్తుల్ని వేసుకోవాలి. కాటన్ దుస్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
Also Read : Heatwave: ఈ రాష్ట్రాల్లోని ప్రజలను హెచ్చరించిన భారత వాతావరణ విభాగం.. ఎందుకంటే..?