Site icon HashtagU Telugu

Life Style : మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదా? ఈ రూల్స్ ఫాలో అయితే ఎలాంటి మనస్పర్దలు రావు!

Life Partner

Life Partner

Life style : కొత్తగా పెళ్లయిన వారు, రిలేషన్ షిప్‌లో ఉన్న వాళ్లు తరచూ చెప్పేవే నా భాగస్వామి నన్ను అర్థం చేసుకోవడం లేదు. అసలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ప్రశ్న ఉత్పన్నం అయ్యిందంటే.. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదని తెలుస్తోంది. భాగస్వాముల మధ్య గొడవలు కామన్. అవి దూరం కావాలంటే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.ప్రతి బంధంలోనూ అవగాహన అనేది చాలా ముఖ్యం. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోవడం లేదని అనిపించినప్పుడు నిరాశ కలుగుతుంది. అయితే, దీనికి కారణం తరచుగా కమ్యూనికేషన్ లోపమే. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించడం ద్వారా సంబంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు, జీవితాన్ని ఆనందంగా మార్చుకోవచ్చు.

మొదటి నియమం ఓపెన్‌గా మాట్లాడుకోవడం..
మీ భావాలను, ఆలోచనలను దాచుకోకుండా స్పష్టంగా వ్యక్తపరచండి. ఊహాగానాలు, అంచనాలకు తావివ్వకుండా, మీకు ఏం కావాలి, మీరు ఎలా ఫీలవుతున్నారు అనేది ప్రశాంతంగా వివరించండి. మీ భాగస్వామికి నిజంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. నిశ్శబ్దంగా ఉండటం, లేదా కోపంతో ప్రతిస్పందించడం వల్ల అపార్థాలు మరింత పెరుగుతాయి తప్ప, పరిష్కారం లభించదు. అందుకే ఇద్దరూ ఒక అవగాహనతో ఉండి ఓపెన్ గా మాట్లాడుకోవాలి.

Warning : పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం – వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

రెండవది, శ్రద్ధగా వినడం. మీ భాగస్వామి మాట్లాడేటప్పుడు వారికి పూర్తి శ్రద్ధ ఇవ్వండి. వారు చెప్పేది మధ్యలో ఆపకుండా, వారు చెప్పదలుచుకున్నది పూర్తయ్యే వరకు వినండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, కేవలం మీ సమాధానం గురించి ఆలోచించకండి. “నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, కానీ…” అని కాకుండా, వారి కోణం నుండి పరిస్థితిని చూడటానికి ప్రయత్నించండి.

మూడవది, భావోద్వేగాలను అంగీకరించడం. మీ భాగస్వామి కోపంగా ఉన్నా, నిరాశగా ఉన్నా, లేదా ఆనందంగా ఉన్నా, వారి భావాలను తీసిపారేయకండి. “నువ్వెందుకు అంత పెద్దగా ఆలోచిస్తున్నావ్?” అని అనకుండా, “నువ్వు ఇలా ఫీలవడానికి కారణం ఏమిటో నేను అర్థం చేసుకుంటున్నాను” అని చెప్పడం ద్వారా వారికి మద్దతుగా ఉండండి. ఇది వారికి భద్రతా భావాన్ని కలిగిస్తుంది, తద్వారా వారు మరింత స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరుస్తారు. చిన్న చిన్న విషయాల్లో కూడా పరస్పరం సహకారం అందించుకోవడం, గౌరవించుకోవడం సంబంధాన్ని దృఢపరుస్తుంది. ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఇద్దరి భావాలు సమానంగా ఉంటాయి. అప్పుడే మనస్పర్దలు తగ్గుతాయి.

Country: జలవాయు మార్పుల కారణంగా మునిగిపోయే స్థితిలో ప్ర‌ముఖ దేశం?!