మాములుగా పుచ్ఛకాయ, అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటి వల్ల అనేక లాభాలు కలుగుతాయి. పుచ్చకాయ మాములుగా సమ్మర్ లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. సమ్మర్లో పుచ్చకాయ తినడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అరటిపండు కూడా ఏడాది కూడా లభిస్తూ ఉంటుంది.. అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే ఎప్పుడైనా ఇవి రెండు కలిపి తిన్నారా, రెండు కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుందట. పుచ్చకాయలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తాయట. వీటితో పాటు.. పుచ్చకాయ లోని లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుందని చెబుతున్నారు. అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందట. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుందట. అరటిని రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందట.
అరటి పండు ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుందని, అంతేకాకుండా వ్యాయామాలు, జిమ్ చేసేవారు అరటిపండును తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని చెబుతున్నారు. అరటిపండు అనేది పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి 6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాల గని. జీర్ణశక్తిని బలోపేతం చేయడం, బరువు తగ్గడం, బరువు పెరగడం, బలమైన ఎముకలు, శక్తి స్థాయిలను పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడం, రక్తంలో చక్కెరను నియంత్రించడం వంటి అనేక ప్రయోజనాలను అరటిపండు అందిస్తుందట. ఇకపోతే పుచ్చకాయ, అరటిపండు కలిపి తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలట. ఈ రెండింటిని ఎట్టి పరిస్థితుల్లో కలిపి తినకూడదని, జ్యూస్ చేసుకుని కూడా తాగకూడదని, ఎందుకంటే పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అరటి పండులో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ నిదానిస్తుందట. దీంతో కడుపులో అసౌకర్యంగా ఉంటుందట. గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందట. వీటిని వేర్వేరుగా తింటే మాత్రం ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిని సపరేట్ గా తినకూడదని కలిపి మాత్రం అస్సలు తినకూడదని చెబుతున్నారు.