Milk: పచ్చిపాలను ముఖంపై ఇలా రాస్తే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం?

పాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 09:30 PM IST

పాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. పాలతో చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. ముఖ్యంగా పచ్చిపాలు చర్మానికి చాలా మంచిది. పచ్చిపాలలో చర్మానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది చర్మాన్ని అనేక సమస్యల నుండి కాపాడుతుంది. మరి అందానికి పచ్చి పాలను ఎలా ఉపయోగించాలి? దాని వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చిపాలని మీ స్కిన్‌పై టోనర్‌గా వాడవచ్చు. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు చర్మానికి పచ్చిపాలని రాయాలి.

దీని వల్ల స్కిన్ బిగుతుగా మారుతుంది. పచ్చిపాల లోని లాక్టిక్ యాసిడ్ చర్మ లోపలి భాగాన్ని క్లీన్ చేయడమే కాకుండా మొటిమలు రాకుండా చేస్తుంది. మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలని వాడడం చాలా బావుంటుంది. ఇది మీ ముఖం నుండి మురికిని పోగొట్టడమే కాకుండా, సహజ తేమని అలానే ఉండేలా చేస్తుంది. ఇది చర్మానికి పోషణ, తేమని అందిస్తుంది. మలినాల వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది. మీరు పచ్చిపాలతో చర్మాన్ని మసాజ్ చేయాలి. పచ్చి పాలలో దూదిని నానబెట్టి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత తేలిగ్గా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి రక్తప్రసరణ బాగా జరిగి చర్మం తాజాగా కనిపిస్తుంది. పచ్చి పాలు గిన్నెలో శనగపిండి, తేనె కలిపి దానిని మీ చర్మానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి సాధారణ నీటితో కడగాలి.

ఇలా చేయడం వల్ల చర్మంలోని మురికి తొలగిపోతుంది. పచ్చిపాలలో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ఫేస్‌ ప్యాక్‌లా పనిచేస్తుంది. ఇది ముఖంపై నల్ల మచ్చల్ని పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. దీన్ని అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా తరచుగా వాడడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. చర్మం నిగనిగలాడుతుంది. పైగా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఉండడం వల్ల చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖరీదైన క్రీమ్స్ కంటే ఇవి చాలా బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.