BhelPuri : ఈ భేల్ పూరి.. రెసిపీ రహస్యం తెలుసుకోవాలంటే.. అతనికి లక్షలు చెల్లించాలట..

భేల్ పూరీ(BhelPuri) రెసిపీని పంచుకోవాలంటే.. ఓ వ్యక్తి ఏకంగా లక్షలు డిమాండ్ చేస్తున్నాడట.

Published By: HashtagU Telugu Desk
If you want this Bhel Puri Recipe you must pay 2.5 lakhs

If you want this Bhel Puri Recipe you must pay 2.5 lakhs

స్ట్రీట్ ఫుడ్(Street Food) అంటే.. నచ్చని వారు, మెచ్చని వారు ఉండరు. అంతలా స్ట్రీట్ ఫుడ్ కు అలవాటుపడిపోయాం మనమంతా. రాత్రయితే చాలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో.. కొన్ని స్ట్రీట్లలో స్ట్రీట్ ఫుడ్ బండ్లు, వాటిని తినేందుకు వచ్చే ఆహారప్రియులతో కిటకిటలాడుతాయి. ఒకటి కాదు.. రెండు కాదు కొన్నివందల రకాల ఆహారాలు దొరుకుతాయి. ఒకేప్రాంతంలో వివిధరకాల ఆహారాలను ఆస్వాదించడంలో ఢిల్లీ(Delhi) నగరం కూడా ఒకటి. ఇక్కడ చాట్, చట్పటా ఆహారాలకు కొదువ ఉండదు. ఆహార ప్రియులు కూడా వాటివైపే ఎక్కువగా మొగ్గుచూపుతారు.

అయితే.. భేల్ పూరీ(BhelPuri) రెసిపీని పంచుకోవాలంటే.. ఓ వ్యక్తి ఏకంగా లక్షలు డిమాండ్ చేస్తున్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే. ఆ పెద్దాయన.. తన స్పెషల్ స్పైసీ భేల్ పూరీ రెసిపీని చెప్పాలంటే రూ.2.5 లక్షలు కట్టాల్సిందేనట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో కర్లీ టేల్స్ పేరుతో ఉన్న అకౌంట్ యూజర్ తెలిపారు. ఢిల్లీలోని నార్త్ క్యాంపస్ లో భేల్ పూరీని అందిస్తున్న ఓ వ్యాపారిపై ప్రత్యేక వీడియోను చిత్రీకరించిన కర్లీటేల్స్.. అతని రహస్య రెసిపీ భేల్ పూరీ గురించి చెప్పేందుకు రూ.2.5 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చింది. ఇంతకీ అందులో స్పెషల్ ఏంటనేగా మీ అనుమానం.

ఈ రుచికరమైన భేల్ పూరీని తయారు చేసేందుకు ఆ పెద్దాయన రకరకాల చట్నీలతో పాటు, సుగంధద్రవ్యాలు, ఉల్లిపాయలు, ఉడికించిన బంగాళదుంపలు, వేరుశెనగలు, ఉబ్బిన మరమరాలని ఉపయోగిస్తాడు. ఒక్కప్లేట్ భేల్ పూరీ రూ.60. ఒక్కసారి తింటే.. జీవితంలో దానిని మరిచిపోలేనంత అద్భుతంగా ఉంటుందట. ఢిల్లీలోని పటేల్ చెస్ట్, నార్త్ క్యాంపస్ లో ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ స్పెషల్ భేల్ పూరీ పాయింట్ అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఢిల్లీ వెళ్తే.. ఈ స్పెషల్ భేల్ పూరీని టేస్ట్ చేయడం మరిచిపోకండి.

 

Also Read : Milk Business: కాసులు కురిపిస్తున్న పాల వ్యాపారం, నెలకు లక్ష సంపాదిస్తున్న బోర్గాడి గ్రామస్తులు

  Last Updated: 22 Aug 2023, 07:39 PM IST