Eye Sight : ఇలా చేస్తే కంటి చూపు తప్పక మారుతుంది..!

టెక్నాలజీ (Technology) వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్ల కంటికి విశ్రాంతి కరవైందనే చెప్పుకోవాలి.

టెక్నాలజీ (Technology) వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ యూజర్ల కంటి (Eye)కి విశ్రాంతి కరవైందనే చెప్పుకోవాలి. రిలయన్స్ జియో చౌక రేట్లకే మొబైల్ డేటాను వినియోగదారులకు పరిచయం చేసి స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని పెంచేసింది. ఇప్పుడు 4జీ కంటే ఎన్నో రెట్లు వేగవంతమైన 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. మరో ఏడాదిలో దేశమంతటినీ 5జీ టెక్నాలజీ చుట్టేయనుంది.

సాధారణంగా నేడు చాలా ఉద్యోగాల్లో కంప్యూటర్ వినియోగం భాగమైపోయింది. మార్కెటింగ్ చేసే వ్యక్తులు సైతం ల్యాప్ టాప్ లో డేటా పంపించాల్సిన అవసరం ఉంటోంది. ఒకవైపు కంప్యూటర్, మరో వైపు ఖాళీ దొరికితే స్మార్ట్ ఫోన్ లో బ్రౌజింగ్, యూట్యూబ్ ()YouTube, ఓటీటీ (OTT) వీక్షణ కంటి చూపుకు హాని చేస్తోంది. అందుకని ప్రతి ఒక్కరూ తమ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చేయదగిన అతి సులభ వ్యాయామ చిట్కాలు ఉన్నాయి. నిపుణులు తెలియజేస్తున్న ఆ వివరాలు…

పామింగ్:

ఇది చాలా సులభమైన వ్యాయామం. కంటి (Eye)పై ఒత్తిడి తగ్గించి, చూపును పెంచుతుంది. రెండు అర చేతులను రబ్ చేసి (రుద్దుకుని) వేడి ఎక్కిన వెంటనే, కళ్లు మూసుకుని, రెండు కళ్లపై రెండు చేతులను కొన్ని సెకన్ల పాటు పెట్టుకోవాలి. ఇలా 5-7 సార్లు చేయాలి. గంటకోసారి ఇలా చేయాలి.

ఐ రోలింగ్:

అంటే కనుగుడ్లను అటూ, ఇటూ, చుట్టూ తిప్పేయడం. రోజులో ఎన్ని సార్లు అయినా ఇలా చేయవచ్చు. ముందుగా గడియారం ముల్లు మాదిరిగా (క్లాక్ వైజ్) తిప్పాలి. ఆ తర్వాత వ్యతిరేక దిశలో తిప్పాలి.

దృష్టి మార్చడం:

కంప్యూటర్ వైపే ఎక్కువ సమయం పాటు చూసే వారు.. కనీసం అరగంటకు ఒకసారి అయినా చుట్టూ ఉన్న వాటివైపు చూడడం చేయాలి. గ్రీన్ రంగులో ఉన్న వాటిని చూస్తే కళ్లకు ఇంకా మంచిది. అలా చూస్తున్నప్పుడు అర చేయివైపు చూసి, ఆ తర్వాత ఎదురుగా చుట్టూ ఉన్న వాటిని చూడాలి.

బ్లింకింగ్:

కను రెప్పలు తెరుస్తూ, మూయడం కూడా మంచి విన్యాసమే. రెండు సెకండ్ల పాటు కను రెప్పలు మూసి, మళ్లీ తెరవాలి. తర్వాత కనురెప్పలను వేగంగా ఐదు సెకండ్ల పాటు కొట్టాలి (తెరుస్తూ, మూయాలి). ఇలా ఐదు సార్లు చేయాలి.

20-20-20:

కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ చూస్తున్న వారు కనీసం 20 నిమిషాలకు ఒకసారి.. 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని, 20 సెకండ్ల పాటు చూడడం వల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.

Also Read:  Weight Loss: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ పండ్లు తినండి..