Site icon HashtagU Telugu

Fruits : ఆ పండ్ల తొక్కలతో ఇలా చేస్తే చాలు ముఖం మెరిసి పోవలసిందే..?

Fruits For Glowing

If You Do This With The Skins Of Those Fruits, Your Face Will Glow..

Fruits for Glowing Skin : పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే వైద్యులు కూడా తరచూ మంచి తాజా పండ్లను తీసుకోమని చెబుతూ ఉంటారు. పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతే కాకుండా ఎన్నో సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే పండ్లలో (Fruits) మనం కొన్ని రకాల పండ్లని తొక్క తీసేసి తింటూ ఉంటాం. ఆరెంజ్‌, బొప్పాయి వంటి పండ్ల (Fruits)ను తొక్క తీసి తింటూ ఉంటాం. వాటి తొక్కలను వ్యర్థాలుగా భావించి పారేస్తూ ఉంటాం.

అయితే ఇక మీదట అలా చేయకండి.. ఎందుకంటే ఆ పండ్ల (Fruits) తొక్కల్లో మీ అందాన్ని రెట్టింపు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. మరి ఏఏ పండ్ల (Fruits) తొక్కలను ఉపయోగించడం వల్ల అందం మెరుగుపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re Now on WhatsApp. Click to Join.

కమల తొక్కల్లో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంతో పాటు నల్ల మచ్చలను తగ్గిస్తుంది. అలాగే యంగ్‌ లుక్‌లో మెరిసిపోవడానికి కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది. కమల తొక్కల్లోని న్యాచురల్‌ యాసిడ్స్‌ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తాయి. అలాగే మృత కణాలను తొలగిస్తుంది.. మూసుకుపోయిన రంధ్రాలను క్లియర్‌ చేస్తుంది. మీకు ప్రకాశవంతమైన రంగును అందిస్తుంది.​
ఇందుకోస కమల తొక్కలను ఎండబెట్టి పొడి చేసి రెండు స్పూన్ల పొడిలో పెరుగు, తేనె మిక్స్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి.

ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే నిమ్మతొక్కల్లో ఉండే సిట్రిక్‌ యాసిడ్ డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి, చర్మపు రంగును సమం చేయడానికి, చర్మంలోని అదనపు నూనెను తొలగించడానికి తోడ్పడుతుంది. ఇందుకోసం నిమ్మతొక్క పొడిలో చక్కెర, ఆలివ్‌ నూనె మిక్స్‌ చేసి ఆ మిశ్రమాన్ని ముఖం మీద సున్నితంగా వృత్తాకారంలో స్క్రబ్‌ చేయాలి. 10 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటే మెరిసే, మృదువైన చర్మం మీ సొంతం. బొప్పాయి తొక్కలో పాపైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి, ఇవి మృత చర్మ కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. బొప్పాయి తొక్కలను పేస్ట్‌ చేసి ముఖానికి అప్లై చేయాలి.

దీన్ని 20 నిమిషాల పాటు ఆరనినిచ్చి ఆ తర్వాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటే చాలు. బొప్పాయి తొక్కలలోని ఎంజైమ్‌లు మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ వేస్తే మృదువైన, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. అరటి తొక్క లోపలి భాగంతో మీ చర్మాన్ని కొన్ని నిమిషాల పాటు రుద్దాలి. దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అరటి తొక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు యవ్వనమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి.

Also Read:  New rules from December 1: డిసెంబర్ నుండి అమలులోకి వచ్చే కొత్త నిబంధనలు ఇవే..!