Lemon Juice : నిమ్మరసం ఎక్కువరోజులు నిలువ ఉండాలంటే.. వెరైటీగా ఇలా చేయండి..

రోజూ నిమ్మరసం తయారుచేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నిమ్మరసం ఎక్కువరోజులు నిలువ ఉండేలా తయారుచేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - June 21, 2023 / 10:30 PM IST

ఎండాకాలం(Summer)లో నిమ్మరసం(Lemon Juice) చేసుకొని తాగితే మన ఆరోగ్యానికి మంచిది ఇంకా మనకు దాహం తీరుతుంది. అలాగే పలు వంటల్లో కూడా మనం అప్పుడప్పుడు నిమ్మరసం వాడతాం. కానీ రోజూ నిమ్మరసం తయారుచేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి నిమ్మరసం ఎక్కువరోజులు నిలువ ఉండేలా తయారుచేసుకోవచ్చు. ఫ్రిజ్ లో నిమ్మకాయల రసాన్ని ఐస్ క్యూబ్స్(Cubes) లాగ చేసి నిలువ ఉంచుకోవచ్చు. వాటిని ఎలా తయారుచేసుకోవాలంటే..

* నిమ్మకాయలు రసం తీసి దానిలో కొద్దిగా ఉప్పు కలిపి ఉంచుకోవాలి.
* కొన్ని నిమ్మకాయలు సన్నని ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి.
* ఐస్ క్యూబ్స్ ట్రేలో నిమ్మరసాన్ని పోసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి తరిగిన నిమ్మకాయ ముక్కని, ఒక పుదీనా ఆకుని ఉంచుకోవాలి.
* ఐస్ క్యూబ్స్ ట్రేని ఫ్రిజ్ లో ఉంచి అవి క్యూబ్స్ లాగా తయారయ్యేవరకు ఫ్రీజ్ లో పెట్టాలి.
* ఇప్పుడు తయారైన ఐస్ క్యూబ్స్ ని జిప్ లాక్ కవర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచుకొని వాడుకోవచ్చు.
* ఈ ఐస్ క్యూబ్స్ కనీసం రెండు నెలల పాటు నిలువ ఉంటాయి.
* ఇలా ఈ నిమ్మరసం క్యూబ్స్ ని డైరెక్ట్ గా నిమ్మరసం బదులు వాడుకోవచ్చు.

 

Also Read :  Curd: స్కిన్ మెరవాల.. అయితే పెరుగుతో ఇలా చేయాల్సిందే?