మనం ఆరోగ్యంగా(Halth) ఉండడానికి మనం తీసుకునే ఆహారం మీదే ఆధారపడుతుంది. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు హెల్త్ కి చాలా మంచిది. కూరగాయలలో ఏ సీజన్ లో వచ్చే వాటిని ఆ సీజన్ లో వండుకోవడం వలన మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. క్యాలీఫ్లవర్(Cauliflower) సీజన్ లో ఇవి ఎక్కువగా తినడం మంచిది.
అయితే క్యాలీఫ్లవర్ లో చిన్న చిన్న పురుగులు కనపడుతుంటాయి. పొలాల్లో పండిన క్యాలీఫ్లవర్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు చాలా మంది. వాటిని కొనేసుకొని సాధారణంగా నీళ్ళల్లో కడిగి వండుకొని తినేస్తారు. దానివల్ల అందులో ఉండే పురుగులతో మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ క్యాలీఫ్లవర్ లో కనపడని పురుగులను కూడా కొన్ని పద్దతులను ఉపయోగించి పోగొట్టవచ్చు.
క్యాలీఫ్లవర్ తో కూర, నిలువ పచ్చడి వంటివి చేసుకుంటూ ఉంటాము. క్యాలీఫ్లవర్ ని కూర వండుకునేటప్పుడు పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అప్పుడే క్యాలీఫ్లవర్ లో ఉండే పురుగులు తొందరగా బయటకు వస్తాయి. క్యాలీఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని ఫోర్స్ గా వాటర్ వచ్చే పంపు దగ్గర పెట్టి కడిగితే పురుగులు పైకి వచ్చేస్తాయి. అలాగే క్యాలీఫ్లవర్ ను ముక్కలుగా కోసుకొని వాటిని ఉప్పు వేసి మరిగించిన వేడి నీళ్ళల్లో వేయాలి ఇలా చేయడం వలన పురుగులు పోతాయి.
చల్లని నీటిలో అయినా ఉప్పు వేసి ఆ నీటిలో క్యాలీఫ్లవర్ ను కాసేపు ఉంచి తీయడం వలన పురుగులు బయటకి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం క్యాలీఫ్లవర్ లోని పురుగులను పోగొట్టవచ్చు. అయితే నీటిలో క్యాలీఫ్లవర్ ను ఎక్కువసేపు ఉంచకుండా కడిగిన తర్వాత వెంటనే వండుకోవాలి.
Also Read : Winter Fruits: చలికాలంలో ఈ ఫ్రూట్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి..!