Black marks on Neck : మెడ మీద నల్లదనం పోగొట్టడం ఎలా?

ఎండాకాలం(Summer)లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి దీని వలన మన మెడ నల్లగా మారుతుంటుంది. మెడ మీద వచ్చే నలుపుదనం తగ్గడానికి ఇంటి చిట్కాలను కొన్నింటిని పాటించవచ్చు.

Published By: HashtagU Telugu Desk
How to Remove Black marks on Neck with Home Tips

How to Remove Black marks on Neck with Home Tips

ఎండాకాలం(Summer)లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి దీని వలన మన మెడ నల్లగా మారుతుంటుంది. అయితే మార్కెట్ లో లభించే రకరకాల క్రీములు వాడడం వలన మన మెడ మీద నల్లదనం పోవడం పక్కన పెడితే ఆరోగ్యానికి మంచిది కాకపోవచ్చు లేదా ఎండ వలన ఏమైనా స్కిన్(Skin) ఎలర్జీలు రావచ్చు. కాబట్టి ఎండ వలన మెడ మీద వచ్చే నలుపుదనం తగ్గడానికి ఇంటి చిట్కాలను కొన్నింటిని పాటించవచ్చు.

కీరదోసకాయను తురుముకోవాలి. ఆ తురుమును మన మెడ మీద నల్లగా ఉన్నచోట మర్దన చేయాలి. మర్దన చేసిన పదిహేను నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వలన మెడ మీద నల్లదనం తగ్గుతుంది ఇంకా కాంతివంతంగా తయారవుతుంది.

టమాటా రసంలో కొన్ని చుక్కల నిమ్మరసం కొద్దిగా తేనె కలపాలి. దానిని మెడ మీద రాసుకోవాలి ఇలా చేసిన పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన మెడ మీద నల్లదనం తగ్గి చర్మం మృదువుగా తయారయ్యేలా చేస్తుంది.

బంగాళాదుంపను మెత్తగా తురమాలి. దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి దీనిని మెడ పైన రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. దీని వలన మెడ మీద నల్లదనం పోయి ప్రకాశవంతంగా తయారవుతుంది.

పెరుగును కొద్దిగా తీసుకొని దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దానిని మెడ మీద రాసుకొని ఒక పదిహేను నిముషాల తరువాత కడగాలి. ఇలా చేయడం వలన మెడ మీద నలుపుదనం తగ్గుతుంది.

నిమ్మరసంలో కాటన్ బాల్ ను ముంచి దానితో మెడ పైన రాసుకోవాలి. ఇలా చేసిన ఇరవై నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. అప్పుడు మెడ మీద నలుపుదనం తగ్గుతుంది.

బాదం నూనెను కొద్దిగా వేడి చేసి దానితో మెడ పైన మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన మెడ మీద నల్లదనం తగ్గుతుంది. కాబట్టి మనం ఇంటిలో దొరికే ఇలాంటి వాటితో మనం మన మెడ మీద నల్లధనాన్ని పోగొట్టవచ్చు.

 

Also Read :  Soaked food: రాత్రిపూట ఈ పదార్థాలు నానబెట్టి తింటే చాలు.. ఆ సమస్యలని పరార్?

  Last Updated: 26 May 2023, 08:57 PM IST