Site icon HashtagU Telugu

Depression : డిప్రెషన్ తగ్గించుకోవడానికి ఏం చేయాలి.. మనమే తగ్గించుకోవచ్చు..

How to Reduce Depression by our Self Follow these Tips

How to Reduce Depression by our Self Follow these Tips

ఈ కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అని తేడా లేకుండా చాలామంది డిప్రెషన్ కు గురవుతున్నారు. ఇటీవలే ప్రముఖ సినీ నటుడు విజయ్ ఆంటోనీ(Vijay Antony) కుమార్తె డిప్రెషన్ కారణంగా సూసైడ్ చేసుకుంది. డిప్రెషన్(Depression) అనేది పెద్ద సమస్య కాదు అలాగని మనం శ్రద్ధ చూపకుండా ఉండే చిన్న సమస్య కాదు.

ఇప్పటి జనరేషన్ లో కొంతమంది పిల్లలు స్కూల్స్ లో చదువుల ఒత్తిడికి తట్టుకోలేక, కొంతమంది యువతీయువకులు ప్రేమ విఫలమైనది అని లేదా ఏదైనా జాబ్ రాలేదనో లేదా మనకు ఇష్టమైన వారు చనిపోయారనో ఎదో ఒక విధమైన ఆలోచనతో డిప్రెషన్ కు గురవుతున్నారు. దీన్ని మనమే గుర్తించి తగ్గించుకోవాలి. డిప్రెషన్ లోకి వెళ్తున్నాం అని అనిపిస్తే మనమే కొన్ని పనులతో తగ్గించుకోవాలి. లేదా ఎవరైనా డిప్రెషన్ లో ఉన్నట్టు అనిపించినా మనం వారికి సహాయం చేయాలి.

ముందు మనం ఏ సమస్యతో బాధపడుతున్నారో దానిని తెలిసిన, దగ్గరైన వ్యక్తులకు చెప్పడం వలన మనలోని బాధ తగ్గుతుంది. అదేవిధంగా మీకు ఎవరైతే నచ్చరో వారికి దూరంగా ఉండడం మంచిది. అలాగే మనం తినే ఆహారంలో ఫ్రెష్ కూరగాయలను, పండ్లను చేర్చడం వలన కొంత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇంకా మనం రోజూ కొన్ని రకాల వ్యాయామాలను చేయడం వలన కూడా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు.

ముఖ్యంగా ధ్యానం చేయడం వలన మన మనసులో ఎటువంటి ఆలోచనలు రాకుండా చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనం రోజూ నిద్ర పోయే సమయంలో మనకు నచ్చని విషయాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని ఆలోచించడం మంచిది కాదు. మనం హాయిగా నిద్రపోవడం వలన డిప్రెషన్ చాలా శాతం తగ్గుతుంది.

ఒత్తిడి వలన మద్యపానం తాగడం అలవాటు చేసుకున్నట్లైతే దానిని మానేయడం మంచిది లేకపోతే అది మన మీద నెగిటివ్ ప్రభావం చూపుతుంది. ధూమపానం అలవాటు ఉన్నా దానిని కూడా మానేయడం మంచిది లేకపోతే క్యాన్సర్ కి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి డిప్రెషన్ నుండి బయట పడడానికి ప్రశాంతమైన నిద్ర, వ్యాయామాలు చేయడం, ధ్యానం చేయడం, ఆహారంలో డైట్ మార్చుకోవడం, మనుషులతో మాట్లాడటం, ప్రకృతిని ఆస్వాదించడం.. వంటివి చేయాలి అప్పుడు కొంత ప్రయోజనం ఉంటుంది.

 

Also Read : Guava Leaves Benefits: జామ పండే కాదు ఆకులు కూడా దివ్యౌషధమే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా..!