మనం ఇటీవల అందం(Beauty) మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నాము. నలుగురిలోకి వెళ్తే అందంగా కనపడాలి అనుకుంటాము. చాలామందికి ముఖం తెల్లగా ఉన్నా మెడ మీద నలుపుగా ఉంటుంది. మెడ మీద నలుపు తగ్గడానికి ఎన్ని రకాల క్రీములు వాడినా, ఎన్ని చిట్కాలు ఉపయోగించినా మెడ మీద నలుపు తగ్గకపోతే చిరాకు అనిపిస్తుంది. కాలుష్యం, ఎండలు, హార్మోన్లు.. ఇలా రకరకాల కారణాలతో మెడ మీద నలుపు(Dark Neck) ఎక్కువగా తయారవుతుంది.
ఓట్స్ మెడ మీద నలుపు తగ్గడానికి సహాయపడుతుంది. ఓట్స్ ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దానిలో టమాటో పేస్ట్ వేసి కలపాలి. దానిని మెడకు రాసి ఇరవై నిముషాల పాటు ఉంచాలి. ఆ తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
నారింజ లేదా బత్తాయి తొక్కలను ఎండబెట్టి వాటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిలో పాలు పోసి పేస్ట్ లాగా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్ ని మెడకు రాసుకొని పది నిముషాల తరువాత నీటితో శుభ్రంగా కడుగుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
కాఫీ పొడి లో రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని మెడకు రాస్తే నలుపు తగ్గుతుంది. ఇలా వారానికి ఒకసారి చేసిన మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఇంటిలో ఉండే వాటితో మనం పేస్ట్ లాగా తయారుచేసుకొని మెడకు రాసుకోవడం వలన మెడ మీద ఉన్న నలుపు తగ్గుతుంది.
Also Read : Milk and Fruits : పాలు, పండ్లు కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?