Mehndi : ఈ రోజుల్లో అందరూ ఎక్కువగా కోన్ మెహందీ పెట్టుకుంటున్నారు. గోరింటాకు దొరకక కొంతమంది, డిజైన్ కోసం కొంతమంది కెమికల్స్ తో తయారుచేసే కోన్ పెట్టుకుంటున్నారు. కానీ వీటి వాడకం వలన చేతులు, కాళ్ళు దురదలు రావడం లేదా మంటగా అనిపించడం వంటివి జరుగుతాయి.
మెహందీ పెట్టుకొని కడిగేసిన తర్వాత మంటగా అనిపిస్తే మనం ఐస్ రాసుకోవచ్చు అప్పుడు చల్లబడుతుంది. లేదా అలోవెరా జెల్ ని కూడా రాసుకోవచ్చు. దీనిని రాసుకొని 15 లేదా 20 నిముషాలు ఉంచిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన మంట తగ్గుతుంది.
మెహందీ పెట్టుకున్న తరువాత ఎక్కడ అయితే దురద వస్తుందో అక్కడ నిమ్మరసం రాసుకోవచ్చు. ఒక పది నిముషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ఎలర్జీ తగ్గుతుంది.
మెహందీ పెట్టుకోవడం వలన వచ్చే సమస్యలు తగ్గడానికి కొబ్బరినూనె కూడా రాయవచ్చు. కొబ్బరినూనె రాసుకోవడం వలన చేతుల పైన వచ్చే దురద, మంట తగ్గుతాయి. పూర్వకాలంలో గోరింటాకు పెట్టుకున్నాక కొబ్బరి నూనె రాసుకునేవాళ్ళు.
మెహందీ వల్ల మంట, దురద ఎక్కువగా అనిపిస్తే డాక్టర్ ని కలిస్తే మంచిది. ఈ విధంగా మనం మెహందీ పెట్టుకున్నప్పుడు ఏమైనా ఎలర్జి వస్తే కొబ్బరినూనె, అలోవెరా జెల్, నిమ్మరసం వంటి వాటిని ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అయితే కోన్ కాకుండా గోరింటాకు ఆకుతో చేసింది అయితే ఆరోగ్యానికి కూడా మంచిది.
Also Read : Pizza : పిజ్జా తినడం వల్ల కలిగే నష్టాలు ఇన్ని ఉన్నాయా..?