మనం దోస(Dosa)లో అన్ని రకాలు తయారుచేసుకుంటాము. ఇటీవల మిల్లెట్(Millets) ఫుడ్ పెరుగుతుంది. అందులో మిల్లెట్ దోసెలు తయారు చేసుకుంటారు. మిల్లెట్స్ లో కొర్రల దోసలు(Foxtail Millet Dosa) కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. కొర్రలలో కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటివి ఉంటాయి. ఈ రకమైన అల్పాహారం తినడం వలన చురుకుగా, శక్తివంతంగా తయారవుతుంది.
కొర్రల దోసలు తయారీకి కావలసిన పదార్థాలు..
* 1 కప్పుల కొర్రలు
* అర కప్పు మినపపప్పు
* అర కప్పు బియ్యం
* ఒక స్పూన్ మెంతులు
* ఉప్పు తగినంత
* రెండు స్పూన్లు నూనె
* అటుకులు అర కప్పు
కొర్రల దోసలు తయారు చేయు విధానం..
కొర్రలను బాగా కడిగి ఐదు లేదా ఆరు గంటలు నానబెట్టాలి. ఇంకొక గిన్నెలో బియ్యం, మినపపప్పు, అటుకులు వేసి నాలుగు గంటలు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటినన్నిటిని మిక్సి లో వేసి మెత్తగా చేసుకోవాలి. మెత్తటి పిండిని ఒక గిన్నెలో వేసి దానిని దోసెలు వేసుకునే విధంగా తయారుచేసుకోవాలి. పెనం మీద నూనె వేసి కాగిన తరువాత దోసెలా పిండిని వెయ్యాలి. దోసెను రెండు వైపులా వేయించాలి. కొర్రల దోసెతో చట్నీ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది.
Also Read : Munagaku Pesarapappu : మునగాకు పెసరపప్పు కూర ఎలా తయారీ చేయాలో తెలుసా?