Site icon HashtagU Telugu

Mango Pickle : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ తురుము పచ్చడి.. ఎలా చేయాలో తెలుసా?

How to prepare mamidikaya Turumu Pachhadi

How to prepare mamidikaya Turumu Pachhadi

ఎండాకాలం(Summer)లో దొరికే మామిడికాయ(Mangoes)తో రకరకాల వంటలు, పచ్చళ్ళు చేసుకుంటాము. వాటిల్లో మామిడికాయ తురుము పచ్చడిని కూడా చేసుకోవచ్చు. ఇది పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. మామిడికాయతో పప్పు, సాంబార్, ఆవకాయ, మాగాయ ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. కానీ ఇది చాలా తొందరగా రెడీ అయ్యే పచ్చడి.

మామిడికాయ తురుము పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవే..

* మామిడికాయలు రెండు
* ఉప్పు తగినంత
* కారం తగినంత
* ఆవపిండి ఒక స్పూన్
* మెంతి పిండి అర స్పూన్
* తాలింపు గింజలు రెండు స్పూన్లు
* నూనె తగినంత
* ఎండు మిర్చి మూడు
* కరివేపాకు కొద్దిగా

మామిడికాయను శుభ్రంగా కడుగుకొని ఒక కాటన్ క్లోత్ తో తుడవాలి. తరువాత దానిని ఒక గిన్నెలో తురుముకోవాలి. తురుముకున్న మామిడిలో ఆవ పిండి, మెంతి పిండి, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. తాలింపుగిన్నెలో నూనె వేసి కాగిన తరువాత తాలింపు గింజలు వేయాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. దీనిని మామిడి తురుములో కలుపుకోవాలి. అంతే మామిడి తురుము పచ్చడి రెడీ అయినట్లే. అయితే ఇది అప్పటికప్పుడు వాడుకోవడానికి మాత్రమే బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు.

 

Also Read : Mango Sambar : సమ్మర్ స్పెషల్.. మామిడికాయ సాంబార్.. ఎలా చేయాలో తెలుసా?