Keera Dosakaya Raitha : ఎండాకాలంలో కీరదోసకాయ పెరుగు పచ్చడి.. ఎలా చేయాలంటే.. హెల్త్‌కి ఎంత మంచిదో తెలుసా?

కీరదోసకాయతో పెరుగు పచ్చడి చేసుకొని తింటే ఎండాకాలంలో మన శరీరానికి ఇంకా మంచిది.

  • Written By:
  • Publish Date - April 22, 2024 / 02:59 PM IST

Keera Dosakaya Perugu Pachhadi : ప్రస్తుతం ఎండాకాలం సాగుతుంది. గత సంవత్సరం కంటే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి మన శరీరానికి చలువ చేసే ఆహారపదార్థాలు తినాలి. కీరదోసకాయ ఎండాకాలంలో చాలా మంచిది అని మన అందరికి తెలుసు. ఆ కీరదోసకాయతో పెరుగు పచ్చడి చేసుకొని తింటే మన శరీరానికి ఇంకా మంచిది.

కీరదోసకాయ పెరుగు పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు..

* పెరుగు ఒక కప్పు
* కీరదోసకాయ ఒకటి
* ఉల్లిపాయలు సన్నగా తరిగినవి రెండు
* నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగినవి
* అల్లం దంచినది కొద్దిగ
* పుదీనా ఆకులు కొన్ని
* క్యారెట్ ఒకటి చిన్నది తురుమినది
* జీలకర్ర కొద్దిగ
* ఉప్పు సరిపడ

కీరదోసకాయ పెరుగు పచ్చడి తయారుచేయు విధానం..

ముందుగా కీరదోసకాయను తురుముకోవాలి. ఒక గిన్నెలో పెరుగును తీసుకొని ఆ పెరుగులో కీరదోసకాయ తురుమును వేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం దంచినది, పుదీనా ఆకులు, జీలకర్ర, సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. అంతే కీరదోసకాయ పెరుగు పచ్చడి రెడీ దీనిని కీరదోసకాయ రైతా అని కూడా అంటారు. దీనిని విడిగా తినవచ్చు లేదా అన్నం, బిర్యానీలలో కూడా కలుపుకొని తినవచ్చు.

కీరదోసకాయ పచ్చడిలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని తినడం వలన మన కడుపు నిండుగా ఉంటుంది, తొందరగా ఆకలి వేయదు. మన శరీరం డీహైడ్రాట్ కాకుండా ఉంటుంది. దీనిని తినడం వలన చర్మం రంగు పెరుగుతుంది. దోసకాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు మన శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. కాబట్టి ఎండాకాలంలో అప్పుడప్పుడు ఈ కీరదోసకాయ పెరుగు పచ్చడి చేసుకొని తినాలి.

 

Also Read : Healthy Kidney : కిడ్నీలను పనితీరుపై ఉప్పు, చక్కెర ప్రభావం చూపుతాయా..?