మనం ఇంటిలో ఏవైనా స్వీట్స్ చేసుకున్నప్పుడు వాటిలో జీడిపప్పు(Cashew) వేసుకుంటూ ఉంటాము. అదే విధంగా జీడిపప్పును ఇప్పుడు కూరల్లో, హాట్స్ లో, అన్నిట్లో వేసుకొని తింటున్నారు. జీడిపప్పును ఏ విధంగానైనా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. స్వీట్ షాప్స్(Sweet Shops) లో జీడిపప్పు స్వీట్స్ లో మాత్రమే కాకుండా జీడిపప్పు పకోడీగా(Jeedipappu Pakodi) కూడా దొరుకుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది.
అయితే అంతే రుచిగా, క్రిస్పీ గా, ఇంకొంచెం తక్కువ కాస్ట్ లోనే జీడిపప్పు పకోడీ మనం మన ఇంట్లో కూడా తయారుచేసుకోవచ్చు.
జీడిపప్పు పకోడీకి కావలసిన పదార్థాలు..
* జీడిపప్పు ఒక కప్పు
* శనగపిండి పావు కప్పు
* బియ్యం పిండి కొద్దిగా
* పసుపు చిటికెడు
* కారం ఒక స్పూన్
* ఉప్పు తగినంత
* ఉల్లిపాయ ఒకటి
* పచ్చిమిర్చి రెండు
* కొత్తిమీర కొద్దిగా
* అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూన్
* చాట్ మసాలా అర స్పూన్
* నూనె వేపుడుకు తగినంత
ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరుగుకోవాలి. కొత్తిమీర కూడా చిన్నగా కోసుకోవాలి. జీడిపప్పులు శనగపిండి, బియ్యం పిండి, నూనె కాకుండా పైన చెప్పుకున్న మిగిలిన అన్ని పదార్థాలను తీసుకొని ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. జీడిపప్పు పకోడీకి పిండి గట్టిగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక మూకుడు పెట్టి నూనె పెట్టి కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత మనం కలుపుకున్న జీడిపప్పు మిశ్రమాన్ని పకోడీ లాగా కాగిన నూనెలో వేసి చిన్న మంట మీద వేగనివ్వాలి. అవి వేగిన తరువాత వేడి వేడిగా పెట్టుకొని తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
Also Read : Kobbari Burelu: ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బూరెలు.. తయారీ విధానం?