Site icon HashtagU Telugu

Bombay Rava Curry : బొంబాయి రవ్వతో బాల్స్ కర్రీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

How to Prepare Bombai Rava Balls Curry simple recipe

How to Prepare Bombai Rava Balls Curry simple recipe

బొంబాయి రవ్వతో(Bombay Rava) ఉప్మా(Upma) చేసుకుంటూ ఉంటాము. అలాగే స్వీట్ చేసుకుంటాము. అయితే మనం ఈజీగా రవ్వను(Sooji) ఉపయోగించి కూర(Curry) కూడా వండుకోవచ్చు.

బొంబాయి రవ్వ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు..

* జీలకర్ర ఒక స్పూన్
* నూనె రెండు స్పూన్లు
* లవంగాలు రెండు
* దాల్చిన చెక్క చిన్న ముక్క
* యాలకులు రెండు
* ఆవాలు ఒక స్పూన్
* మెంతులు పావు స్పూన్
* ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినది
* అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగ
* పసుపు పావు స్పూన్
* ధనియాల పొడి ఒక స్పూన్
* టమాటాలు రెండు
* పెరుగు పావు కప్పు
* నీళ్లు రెండు గ్లాసులు
* కొత్తిమీర కొద్దిగ తరిగినది

రవ్వ బాల్స్ తయారీకి కావలసిన పదార్థాలు..

* బొంబాయి రవ్వ 1 1 / 4 కప్పు
* శనగపిండి అర కప్పు
* ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగినది
* కొత్తిమీర కొద్దిగ
* ధనియాల పొడి కొద్దిగ
* కారం అర స్పూన్
* ఉప్పు తగినంత
* గరం మసాలా పొడి కొద్దిగా
* నూనె డీప్ ఫ్రైకి తగినంత

ఒక గిన్నెలో రవ్వను తీసుకొని దానిలో రవ్వ బాల్స్ కి కావలసిన అన్ని పదార్థాలను నూనె కాకుండా మిగిలిన పదార్థాలను కలిపి నీళ్లు పోస్తూ పిండి ముద్ద తయారుచేసుకోవాలి. దానిపై మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచాలి. తరువాత పిండి ముద్దను చిన్న చిన్న రౌండ్స్ లాగా తయారుచేసుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దానిలో నూనె వేసుకొని అది కాగిన తరువాత అంతకు ముందు తయారుచేసుకున్న రౌండ్స్ ను వేసి వేగనివ్వాలి. వేగిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని పొయ్యి మీద పెట్టి నూనె వేసి జీలకర్ర, మెంతులు, ఆవాలు వేసి వేగనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి అవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. అనంతరం మనం తీసుకున్న టమాటా ముక్కలను కూరలో వేసి కలుపుకోవాలి. రెండు నిముషాల తరువాత పెరుగు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా మగ్గుతున్నప్పుడు కొన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అది ఉడుకుతున్నప్పుడు రవ్వ బాల్స్ వేసి కలపాలి. తరువాత ఒక పావుగంట సేపు మూత పెట్టి ఉంచాలి. తరువాత కొత్తిమీర తరుగుకొని దానిని కూరలో వేసి కలుపుకోవాలి. అంతే రవ్వ కూర తయారైనట్లే. ఇది ఎంతో రుచిగా కుర్మా కూరలాగా ఉంటుంది. దీనిని మనం అన్నం లేదా చపాతీతో పాటు తినవచ్చు.

 

Also Read : Ullipaya Pulusu: ఎప్పుడైనా ఉల్లిపాయ పులుసు తిన్నారా.. అయితే ట్రై చేయండిలా?