ఉప్మా(Upma) అనేది మన ఆరోగ్యానికి మంచిది. అది తేలికగా మనకు జీర్ణం అవుతుంది. మిల్లెట్స్(Millets) లో ఒకటైన అరికెలతో కూడా ఉప్మా(Arikela Upma )వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. అరికెలలో(Kodo Millet) డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇది మన రక్తంలో చక్కరను ఉత్పత్తి చేయదు. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా ఈ ఉప్మాను తినవచ్చు.
అరికెల ఉప్మా తయారీకి కావలసిన పదార్థాలు
* రెండు కప్పుల అరికెలు
* ఒక ఉల్లిపాయ
* పచ్చిమిర్చి రెండు
* పసుపు కొద్దిగ
* తాలింపు దినుసులు కొన్ని
* ఎండు మిర్చి ఒకటి
* కరివేపాకు ఒక రెమ్మ
* నూనె సరిపడ
* ఉప్పు తగినంత
* కొత్తిమీర కొద్దిగా
అరికెల ఉప్మా తయారీ విధానం..
ముందు అరికెలను కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిలో కొన్ని నీళ్లు పోసి కాగనివ్వాలి. అనంతరం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత ఎండుమిర్చి వేయాలి. వేగిన తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. వీటిల్లో కావాలంటే క్యారెట్, పల్లీలు, బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఉడికిన తరువాత ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున నీళ్లు పోసి అరికెలు, ఉప్పు, పసుపు వేసి కలబెట్టాలి. అనంతరం అరికెలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లాలి. వేడి వేడిగా అరికెల ఉప్మా తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనికి చట్నీ లేదా ఏదైనా పచ్చడి జత చేసి తినొచ్చు.
Also Read : Curd in Summer: ఏంటి.. ప్రతిరోజు పెరుగు తింటే అలాంటి సమస్యలు వస్తాయా?