Annam Appalu : మిగిలిపోయిన అన్నంతో అప్పాలు(రొట్టె) ఎలా తయారుచేయాలో తెలుసా??

మిగిలిపోయిన అన్నంతో అప్పాలు(Annam Appalu) కూడా తయారుచేయవచ్చు.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 11:00 PM IST

మనం అందరం మన ఇంటిలో అన్నం(Annam) మిగిలిపోతే దానితో తాలింపు అన్నం చేసుకుంటాం. కొంతమంది అయితే అన్నం(Rice) మిగిలితే పడేస్తారు. కొంతమంది పచ్చడి(Pickle)తో తింటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో అప్పాలు(Annam Appalu) కూడా తయారుచేయవచ్చు.

అన్నం అప్పాలు తయారీకి కావాలసిన పదార్థాలు:-

* మిగిలిన అన్నం మూడు కప్పులు
* ఉల్లిపాయ చిన్నగా రెండు తరిగినవి
* క్యారెట్ తురుము ఒక కప్పు
* పచ్చిమిర్చి నాలుగు సన్నగా తరిగినది
* అల్లం చిన్న ముక్క
* కరివేపాకు కొద్దిగ
* కొత్తిమీర కొద్దిగా తరిగినది
* జీలకర్ర కొద్దిగ
* బియ్యం పిండి ముప్పావు కప్పు
* ఉప్పు రుచికి తగినంత
* నూనె సరిపడ

అన్నాన్ని నీళ్లు పోయకుండా మిక్సి లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిని ఒక గిన్నెలో వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, కొద్దిగ బియ్యం పిండి కలిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పదిహేను నిముషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని వాటిని కవర్ మీద అప్పాల రూపంలో చేతితో ఒత్తుకోవాలి. దానిని పెనం మీద కొద్దిగ నూనె వేసి రెండు వైపుల కాల్చాలి. వాటిని వేడి వేడిగా తింటే అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ విధంగా మనం మిగిలిపోయిన అన్నంతో పిల్లలకు నచ్చే విధంగా అప్పాలు చేయవచ్చు.

 

Also Read : Spicy Food in Rain : వర్షాకాలంలో పకోడీలు, బజ్జిలు తినాలని ఎందుకు అనిపిస్తుందో మీకు తెలుసా?