Rasam Powder : చారుపొడి రెసిపీ.. 6 నెలలకు సరిపడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

చారు తినడం వల్ల మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. అందుకే పిల్లలకు కూడా ఎక్కువగా చారు అన్నం తినిపిస్తుంటారు. చారులోకి వాడే పొడిని.. 6 నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - June 9, 2024 / 07:46 PM IST

Rasam Powder Recipe : చారు లేదా రసం.. తెలుగు రాష్ట్రాల్లో వీటిని భోజనంలో ఎక్కువగా తింటుంటారు. మరీ ముఖ్యంగా.. నాన్ వెజ్ వంటకాలు.. చికెన్, మటన్ వండుకున్నప్పుడు, ఫంక్షన్లలో భోజనాలు పెట్టినపుడు చారు కచ్చితంగా వడ్డిస్తారు. చారు తినడం వల్ల మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది. అందుకే పిల్లలకు కూడా ఎక్కువగా చారు అన్నం తినిపిస్తుంటారు. చారులోకి వాడే పొడిని.. 6 నెలలపాటు నిల్వ ఉండేలా తయారు చేసుకోవచ్చు. మరి చారుపొడిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

చారుపొడి రెసిపీకి కావలసిన పదార్థాలు

మిరియాలు – 1 స్పూన్

ధనియాలు – 1 స్పూన్

ఇంగువ – 1/4 స్పూన్

ఎండుమిర్చి – 8

వెల్లుల్లి – 10 రెబ్బలు

జీలకర్ర – 1 స్పూన్

కరివేపాకులు – గుప్పెడు

చారుపొడి తయారీ విధానం

ముందుగా స్టవ్ పై కళాయిపెట్టుకుని ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినపప్పు వేసి వేయించుకోవాలి.

వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని.. అదే కళాయిలోకి అరస్పూన్ నూనె వేసి ఎండుమిర్చిని వేయించి.. మిక్సీ జార్లో వేసుకోవాలి.

ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా అందులో వేసుకోవాలి. ఇంగువ కూడా వేసి పొడి చేసుకోవాలి. చారుపొడి రెడీ.

ఈ పొడిని గాలిదూరని డబ్బాల్లో వేసుకుని పెట్టుకుంటే.. ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.

6 నెలల వరకూ రావాలంటే.. ఒక అంచనా వేసుకుని పైన చెప్పిన పదార్థాల క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది.

చారు తాగినా, అన్నంలో కలుపుకుని తిన్నా మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని అన్నంలో కలుపుకుని తింటే జీర్ణ సమస్యలు తలెత్తవు. జీర్ణశక్తి పెరిగి అరుగుదల జరుగుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలున్నా.. వేడి వేడి చారు తాగితో ఉపశమనం కలుగుతుంది.

Also Read : Bellam Sunnundalu : పిల్లలు, మహిళలకు బలాన్నిచ్చే బెల్లం సున్నుండలు.. ఇలా చేస్తే సూపర్ !