Sleep Tips: రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవాలంటే ఇలా చేయాల్సిందే..!

మెలటోనిన్ అనే హార్మోన్ వల్లే రాత్రి హాయిగా నిద్రపడుతుంది.

  • Written By:
  • Publish Date - November 21, 2022 / 06:30 AM IST

మెలటోనిన్ అనే హార్మోన్ వల్లే రాత్రి హాయిగా నిద్రపడుతుంది. ఇది లేకపోవడం వల్ల నిద్ర పట్టదు. అయితే మన శరీరం ఈ హార్మోన్ ను సహజంగానే ఉత్పత్తి చేస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే ఈ మెలటోనిన్ హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంది. మన శరీరంలో మెలటోనిన్ స్థాయిలు చీకటి పడుతున్న కొద్దీ పెరుగుతాయి. మెలటోనిన్ రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మరి ఈ హార్మోన్ పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

– ప్రతిరోజూ ఉదయం కనీసం 15 నిమిషాలైనా సూర్యరశ్మిలో ఉండాలి. దీనివల్ల మెలటోనిన్ స్థాయి పగటి పూట బాగా తగ్గుతాయి. రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి వలన శరీరానికి విటమిన్ డి అందుతుంది. దీంతో ఎముకలు బలంగా ఉంటాయి. చీకటి కూడా నిద్రను ప్రేరేపిస్తుంది. అందుకే మీరు పడుకునే గదిలో వెలుతురు ఉండకుండా చూసుకోవాలి.

– మెగ్నీషియం మన శరీరానికి చాలా అవసరం. ఇవి ఉండే ఆహారాలను రాత్రిపూట తినడం వల్ల రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది. మెగ్నీషియం మెదడు పనితీరును మందగించేలా చేస్తుంది. అవకాడో, బాదం, గుమ్మడి గింజలు, ఆకుకూరల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మీరు రాత్రిపూట ప్రశాంతంగా, ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా పడుకోవడానికి సహాయపడతాయి.

– మీరు పడుకునే రెండు గంటల ముందు నుంచే డిజిటల్ పరికరాలను (ఫోన్, ల్యాప్ టాప్) పక్కన పెట్టండి. ఎందుకంటే వీటి నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను దూరం చేస్తుంది. వీటి నుంచి తరంగదైర్ఘ్యాలు మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తాయి.

– కెఫిన్ ను ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా నష్టమేమీ జరగదు. కానీ రాత్రిపూట కెఫిన్ ను అస్సలే తాగకూడదు. భోజనం తర్వాత కెఫిన్ ఉన్న పానీయాలను, ఆహారాలను అసలే తీసుకోకూడదు. కెఫిన్ తాగితే బాడీ యాక్టీవ్ అవుతుంది.

– ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ విడుదలను నిరోధిస్తుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ విడుదలను కూడా అడ్డుకుంటుంది. మెలటోనిన్, కార్టిసాల్ విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. వీటిలో ఏది తగ్గినా రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టదు. యోగా, ధ్యానం, వ్యాయామంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.