World Book Day 2024: పిల్లల్లో పుస్తకాలను చదివే అలవాటును ఎలా పెంపొందించాలి?

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ఉద్దేశ్యం ప్రజలలో పుస్తకాలపై ఆసక్తిని రేకెత్తించడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలను గౌరవించడం. అయితే పిల్లల్లో చదివే అలవాటును ఎలా పెంపొందించవచ్చో తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి.

World Book Day 2024: ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీని ఉద్దేశ్యం ప్రజలలో పుస్తకాలపై ఆసక్తిని రేకెత్తించడం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రచయితలను గౌరవించడం. అయితే పిల్లల్లో చదివే అలవాటును ఎలా పెంపొందించవచ్చో తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి. పిల్లలు పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడం ద్వారా నలుగురిలో దైర్యంగా ఉంటారు. భవిష్యత్తుపై విశ్వాసం పెరగడమే కాకుండా, బాగా రాయడం, మాట్లాడడం చేయగలరు. అయితే పిల్లలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చదవడానికి ఆసక్తి చూపకపోతే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే.

పిల్లల్ని మాల్ లేదా రెస్టారెంట్‌కే కాకుండా లైబ్రరీకి కూడా తీసుకువెళ్లాలి. అక్కడి వాతావరణం వాళ్ళకి అలవాటు అవుతుంది. దీంతో క్రమంగా పుస్తకాలు చదవడంపై శ్రద్ద పెడతారు. కొన్ని రోజులకి వారికి నచ్చిన పుస్తకాలను స్వయంగా వెతుక్కుని చదువుతారు. వారికి వివిధ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాల గురించి చెప్పండి. ఏ పుస్తకాన్ని చదివి పూర్తి చేయాలో వారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించండి. ఇలా చేయడం ద్వారా చదువుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు. చదివిన తర్వాత అలా వదిలేకూండా సమీక్ష వ్రాయమని వారిని అడగవచ్చు. ఇది వారి పదజాలాన్ని పెంచడమే కాకుండా, వారు ఏ రకమైన పుస్తకాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉన్నారో తెలుసుకోవడంలో కూడా సహాయపడుతుంది.చాలామంది తల్లిదండ్రులు తమకు నచ్చిన పుస్తకాన్ని చదవమని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. ఈ పరిస్థితిలో ఇది వారి మనస్సును పుస్తకాల నుండి మరింత దూరం చేస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చదవడానికి ఇష్టపడే సబ్జెక్టులు కూడా వారికి ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఫిక్షన్, ఫ్యాషన్, మైథాలజీ, సైన్స్, ఫుడ్ అండ్ టెక్నాలజీ వంటి అనేక విభాగాలకు చెందిన అనేక పుస్తకాలు ఈరోజు మార్కెట్‌లో ఉన్నాయి. సో వాళ్ళకి ఏ రకమైన పుస్తకాలని చదవాలని అనుకుంటున్నారో, ఆ దిశగా వాళ్ళని ప్రోత్సహించండి.

We’re now on WhatsAppClick to Join

పిల్లలు పుస్తకాన్ని పూర్తి చేసినప్పుడల్లా, అతనికి బహుమతి ఇవ్వడానికి ప్రయత్నించండి. దీనివల్ల తాము చేసిన ఘనత తక్కువేమీ కాదన్న స్పృహ కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో వారు క్రమంగా చదువుకునే అలవాటును పెంపొందించుకోవడమే కాకుండా వారు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఉత్సాహంగా ఉంటారు. ఇది మాత్రమే కాకుండా వారు దాని గురించి వారి స్నేహితులకు ఖచ్చితంగా చెబుతారు.

Also Read: Arvind Kejriwal : మే7 వరకు కేజ్రీవాల్‌ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు