Summer Tips : వేసవి వచ్చింది అంటేనే మనం అందరం వేడికి తట్టుకోలేక కూలర్లు, AC లు వాడుతుంటాము. కానీ వాటికి మన శరీరం అలవాటు పడితే మనం అవి లేకుండా ఉండలేము. ఇంకా బయట ఉండడానికి ఇష్టపడము. AC చల్లదనం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి మనం ఎండ నుండి తట్టుకోవడానికి మన ఇంటిని కూలింగ్ గా ఉంచడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. వాటి వలన మన ఇల్లు AC, కూలర్ లేకుండానే చల్లగా ఉంటుంది.
*మొదట మన ఇంటి పైన కూలింగ్ పెయింటింగ్ వేయించుకోవాలి. ఇంటి పైన కూల్ రూఫ్ టైల్స్ వేయించుకుంటే ఎండ మన ఇంటి లోపలికి ఎక్కువగా రాదు.
*ఇంటి పైన గార్డెనింగ్ చేయడం వలన కూడా మన ఇల్లు చల్లగా ఉంటుంది. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు ఇలా ఏవైనా మనకు నచ్చినవి పెంచుకోవచ్చు.
*ఇంటికి తేలికపాటి రంగులు వేసుకోవడం వలన వేడిని గ్రహించకుండా ఉంటుంది.
*ఇంటి కిటికీలకు బ్లైండ్స్ లేదా బ్లాక్అవుట్ కర్టైన్స్ వాడితే ఇంటి లోనికి ఎండ రాకుండా అడ్డుకుంటుంది. వెదురు కర్టైన్స్, వట్టి వేరు మ్యాట్స్ వాడడం వలన కూడా మన ఇల్లు చల్లగా ఉంటుంది.
*కలబంద, స్నేక్ ప్లాంట్ వంటి మొక్కలను మన ఇంటి లోపల పెంచాలి. ఇవి మన ఇంటి వాతావరణం చల్లగా ఉంచడానికి సహాయపడతాయి.
*ఉదయం, సాయంత్రం సమయంలో కిటికీలు, తలుపులు తెరవాలి. అప్పుడే మన ఇంటిలోనికి తాజా గాలి అనేది వస్తుంది. ఎండ సమయంలో కిటికీలు, తలుపులు మూసివేయాలి.
*మనం ఎండా కాలంలో కుండలో నీరు పోసుకొని తాగడం తెలిసిన విషయమే. అయితే మనం కుండని మన ఇంటిలో వేడి ఎక్కడ ఎక్కువగా వస్తుందో అక్కడ ఉంచితే మన ఇంటిలో చల్లదనం ఏర్పడుతుంది.
Also Read : Coconut Water: కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా చేరుతాయి ? వేళ్ల నుంచి టెంకలోకి దారేది ?