Bad Mood to Happiness : మూడ్ బాగోలేదా.. ఇలా మార్చేయండి..

మూడ్ ఆఫ్ అయినప్పుడు తొందరగా మామూలు స్థితికి రావడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. దీని వలన మళ్ళీ మనం మామూలు స్థితికి రావచ్చు.

Published By: HashtagU Telugu Desk
How to come out from Bad Mood to Happy Mood

How to come out from Bad Mood to Happy Mood

మనలో చాలామందికి మనల్ని ఎవరూ కోప్పడకపోయినా మనల్ని చిన్న మాట అంటే చాలు మన పెదాల మీద ఉండే చిరునవ్వు తక్షణం తొలగిపోతుంది. ఇంకా మూడ్ ఆఫ్ అయిపోతుంది. మనలోని ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు కూడా మనలోని సంతోషాన్ని తొలగిస్తాయి. ఇలా మూడ్ ఆఫ్ అయినప్పుడు తొందరగా మామూలు స్థితికి రావడానికి కొన్ని చిట్కాలను పాటించవచ్చు. దీని వలన మళ్ళీ మనం మామూలు స్థితికి రావచ్చు.

మనం ఏదయినా వ్యాయామం చేసినప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్లు విడుదల చేస్తాయి. కాబట్టి మనం వాక్, నృత్యం, నెమ్మదిగా పరుగు తీయడం ఇలా మనకు నచ్చిన వ్యాయామం ఏదయినా చేయడం వలన మన మనసు తేలికపడి మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. మళ్ళీ ఆనందంగా ఉంటారు. ఇంకా మామూలుగా అయితే మనకు బాధగా ఉంటే ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తుంది అందరికీ కానీ మనం ఒంటరిగా ఉండకుండా మన అమ్మ లేదా నాన్న లేదా మనకు నచ్చిన స్నేహితులలో ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడడం వలన మన మనసులోని బాధ పోయి మన మనసు తేలికపడుతుంది.

చదువు, ఆఫీస్, ఇల్లు ఇలా తీరిక లేకుండా పని చేసుకుంటూ పోతూ ఉంటే ఒత్తిడికి లోనయ్యి సంతోషాన్ని కోల్పోతారు. కాబట్టి పని అయిన తరువాత అయినా కాసేపు శ్వాస సంబంధ వ్యాయామాలు చేయడం లేదా కాసేపు కళ్ళు మూసుకొని సేద తీరడం వంటివి చేయడం వలన మన మనసు తేలికపడుతుంది. ఇంకా మనం ఎప్పుడూ సంతోషంగా మూడ్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి మనం మనకు నచ్చిన సంగీతాన్ని మనం వినే అంత సౌండ్ లో పెట్టుకొని వింటూ ఉండడం వంటివి చేయవచ్చు. ఇంకా మనకు ఏదయినా కొత్త పని చేయాలని అనిపిస్తే చేయవచ్చు దాని గురించి మనకు పూర్తిగా తెలియాల్సిన పనిలేదు కానీ ఆ పని మీద మనకు ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగే టీవిలో లేదా యూట్యూబ్ లో కామెడీ సినిమాలు, షోలు చూసి నవ్వుకొని మన మూడ్ ని మార్చుకోవచ్చు. ఇలా చేయడం వలన మన మనసు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.

 

Also Read : Belly Fat : పొట్ట తగ్గించాలనుకుంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..

  Last Updated: 04 Jul 2023, 08:34 PM IST