Site icon HashtagU Telugu

Gas Burners: గ్యాస్ బర్నర్‌లను ఎలా శుభ్రం చేయాలి? ఇంటి చిట్కాలీవే!

Gas Burners

Gas Burners

Gas Burners: వంట చేసేటప్పుడు గ్యాస్ బర్నర్లపై నూనె, మసాలాలు, ఆహార పదార్థాల అవశేషాలు పడి జిడ్డుగా, నల్లగా తయారవుతుంటాయి. ఈ మొండి మరకలు సులభంగా పోవు, బర్నర్‌ల (Gas Burners) మెరుపును తగ్గిస్తాయి. అంతేకాకుండా మురికి ఎక్కువగా పేరుకుపోతే బర్నర్లు సరిగా పనిచేయడం కూడా ఆపేస్తాయి. అందుకే గ్యాస్ బర్నర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఈ మరకలను తొలగించడానికి ఖరీదైన, రసాయనాలతో కూడిన క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. మరికొందరు ఇంట్లో లభించే వస్తువులతోనే శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు కూడా ఈసారి గృహ చిట్కాలను ప్రయత్నించి విఫలమైతే మీకు ఒక సులభమైన, త్వరగా పనిచేసే చిట్కాను మేము అందిస్తున్నాము. కేవలం రూ. 10 ఖర్చుతో మీరు ఒక శక్తివంతమైన ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చ. ఇది మీ గ్యాస్ బర్నర్‌ను కొత్తదానిలా మెరిపిస్తుంది.

కేవలం రూ. 10తో నల్లగా జిడ్డుగా ఉన్న గ్యాస్ బర్నర్‌లను ఎలా శుభ్రం చేయాలి?

కేవలం రూ. 10 ఖర్చుతో మీరు ఒక మ్యాజికల్ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది మీ గ్యాస్ బర్నర్‌ను కొత్తదానిలా మెరిపిస్తుంది. దీని కోసం అవసరమైన పదార్థాలు క్రింద ఇవ్వబడ్డాయి.

Also Read: Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

గ్యాస్ బర్నర్‌లను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని త‌యారు చేయండిలా

మ్యాజికల్ ద్రావణం ఎలా పనిచేస్తుంది?

ఈ ద్రావణంలో ఉన్న బేకింగ్ సోడా ఒక మైల్డ్ ఆల్కలైన్ పదార్థం. ఇది జిడ్డు, మురికిని వదులు చేస్తుంది. ఈనో, వేడి నీరు, నిమ్మరసం కలిపి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ రసాయన చర్య బర్నర్‌లపై పేరుకుపోయిన మొండి జిడ్డు, కాలిన అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వాటిని సులభంగా తొలగించవచ్చు.

గ్యాస్ బర్నర్‌లను ఎలా శుభ్రం చేయాలి?

Exit mobile version