Sky Fruit : గుండెపోటు రిస్క్ ను తగ్గించే ‘స్కై ఫ్రూట్’.. తెలుసా ?

Sky Fruit : స్కై ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా ? అది చూడటానికి కివీ ఫ్రూట్ లాగే కనిపిస్తుంది.

  • Written By:
  • Updated On - October 17, 2023 / 05:03 PM IST

Sky Fruit : స్కై ఫ్రూట్ గురించి ఎప్పుడైనా విన్నారా ? అది చూడటానికి కివీ ఫ్రూట్ లాగే కనిపిస్తుంది. దీన్ని ఆగ్నేయాసియా దేశాలలోనే ఎక్కువగా తింటారు. ఎన్నో ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించే ఔషధ గుణాలు స్కై ఫ్రూట్ లో ఉన్నాయి. కివీ చాలా మెత్తగా ఉంటే.. స్కై ఫ్రూట్ గట్టిగా ఉంటుంది. దీన్ని పగలగొట్టి గింజను బయటకు తీయాలి. స్కై ఫ్రూట్ అంత టేస్టీగా ఉండదు. చేదుగా ఉంటుంది. అందుకే దీన్ని తినే వాళ్ల సంఖ్య తక్కువ. విశేషం ఏమిటంటే.. స్కై ఫ్రూట్ (Sky Fruit)  విత్తనాన్ని కూడా తినొచ్చు. ఈ ఫ్రూట్ ను పొడి రూపంలోకి మార్చుకొని కూడా తింటారు.

We’re now on WhatsApp. Click to Join.

  • షుగర్ వ్యాధి ఉన్నవారు స్కై ఫ్రూట్ ను తింటే ప్రయోజనకరం. షుగర్ లెవల్ 200 కంటే ఎక్కువ ఉన్నవాళ్లు స్కై ఫ్రూట్ ను తింటే.. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
  • గుండెపోటు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను ఈ ఫ్రూట్ తగ్గిస్తుంది.  రక్తనాళాలు మూసుకుపోకుండా, కరోనరీ వ్యాధులు రాకుండా ఈ పండు చేస్తుంది.
  • మలబద్ధకం వంటి సమస్యలు రావు.
  • స్కిన్ ఎలర్జీలు దరిచేరవు.
  • ఆస్తమా ఉన్నవారు ఈ పండును తింటే ఎంతో మంచిది.
  • స్కై ఫ్రూట్ ను తక్కువగా తినాలి. అతిగా తింటే కాలేయం దెబ్బతినే రిస్క్ ఉంటుంది.
  • ఈ పండు తిన్నాక వికారంగా అనిపించినా, ఆకలి వేయకపోయినా, మూత్రం రంగు మారినా వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్లాలి.
  • కళ్ళల్లోని తెలుపు రంగు కాస్త పసుపు రంగులోకి మారినా, చర్మం పసుపు రంగులోకి మారినా దీన్ని తినడం మానేయాలి.

Also Read: Nakki Lake : నక్కి సరస్సు, మౌంట్ అబూ

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.