చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా పెదవులు పొడిబారుతూ ఉంటాయి. పెదవులు పొడి బారడంతో పాటు కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా వస్తూ ఉంటుంది. దాంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే పెదవులు పొడి బారకుండా ఉండడం కోసం అనేక రకాల బ్యూటీ, ప్రోడక్ట్స్,హోమ్ రెమిడీస్ ఫాలో అవుతూ ఉంటారు. మరి పెదాలు పొడిబారకుండా ఉండడం కోసం ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేయాలి.
ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి. వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది. టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడు చందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది. అలాగే టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డు లోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగెయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది.
అదేవిధంగా కొబ్బరి నూనె, లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి క్యారియర్ ఆయిల్ లో ఒకటి రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్, లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీం ఆయిల్ వంటి ఎస్సెన్షియల్ ఆయిల్ కలపి పెదవుల మీద రాసి అలాగే వదిలేయాలి. రోజులో ఇలా రెండు మూడు సార్లు ఇలా రాయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసి రాత్రంతా కూడా వదిలేయవచ్చు. ఇలా చేయడం వల్ల పెదవులు పొడి బారే సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఐదారు గులాబీ రేకులని పావు కప్పు పచ్చి పాలలో రెండు మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత ఈ రేకుల్ని మెత్తటి పేస్ట్ లా చేత్తో నలపాలి. ఈ పేస్ట్ ని పెదవులకి పట్టించి 20 ఉంచాలి. ఆపై చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి వారమంతా చేయాలి. ఒక కీరా ముక్క తీసుకుని లిప్స్ మీద రబ్ చేయండి. ఆ జ్యూస్ ని పది నిమిషాల పాటు మీ లిప్స్ మీద అలా వదిలేసి ఆ తరువాత కడిగేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.