Baldness Tips: బట్టతలకు, జుట్టు రాలే ప్రాబ్లమ్ కు ఇంటి చిట్కాలు

జుట్టు రాలడం అనేది సహజమైన ప్రక్రియ.  దువ్వుతున్నప్పుడు (Combing) జుట్టు రాలడం సర్వసాధారణం. 

జుట్టు రాలడం అనేది సహజమైన ప్రక్రియ.  దువ్వుతున్నప్పుడు జుట్టు రాలడం సర్వసాధారణం. జుట్టు రాలడం వల్ల బట్టతల (Baldness) వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ.. ఎక్కువగా జుట్టు రాలడం ప్రారంభించినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.  కాలుష్యం, దుమ్ము, తప్పుడు ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం, రసాయన ఉత్పత్తుల అధిక వాడకం, ఒత్తిడి మొదలైనవి జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. జుట్టు రాలడాన్ని అరికట్టే కొన్ని హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హెడ్ మసాజ్

హెడ్ మసాజ్ చేయడం వల్ల తల భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ఇంప్రూవ్ చేస్తుంది. మంచి హెయిర్ ఆయిల్ సహాయంతో తేలికపాటి చేతులతో జుట్టును మసాజ్ చేయాలి.

కొబ్బరి నూనె

కొబ్బరినూనెను వాడటం ద్వారా మన తల స్కాల్ప్ భాగంలో మైక్రో బయోటా ఇంప్రూవ్ అవుతుంది. తద్వారా జుట్టు కుదుళ్లు, స్కాల్ప్‌ బలోపేతం అవుతాయి. కొబ్బరి నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జుట్టు షాఫ్ట్‌లోకి చొచ్చుకుపోయి జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కనీసం వారానికి రెండుసార్లు, కొబ్బరి నూనెను మీ తలకు మసాజ్ చేయండి. స్నానం చేయడానికి కొన్ని గంటల ముందు లేదా రాత్రిపూట తలకు మసాజ్ చేసుకుంటే బెస్ట్.

ఆమ్లా

ఉసిరిలో హెయిర్ ఫోలికల్స్‌ (జుట్టు కుదుళ్ల)ను బలోపేతం చేయడానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇందులోని విటమిన్ సి జుట్టు త్వరగా తెల్లబడకుండా ఆపుతుంది.

ఆముదం

ఆముదం మన జుట్టు కోసం ఒక అద్భుతమైన పోషకం.  ఇందులో ప్రొటీన్లు, విటమిన్ ఇ , అనేక మినరల్స్ ఉంటాయి. ఆముదం అనేది ప్రపంచంలోనే అత్యంత మందమైన నూనె.కాబట్టి దీనిని నేరుగా జుట్టుకు పూయలేరు.  ఆముదం ఎల్లప్పుడూ ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పెట్టుకోవాలి.

ఉల్లిపాయ రసం

ఉల్లిపాయ రసం పెట్టడం వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలోపేసియా ఏరియాటా అనే వ్యాధి ఉన్నవాళ్లకు ఉల్లిపాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువయింది. అలోపేసియా ఏరియాటా వ్యాధి కారణంగా శరీరంలోని వివిధ భాగాల నుంచి వెంట్రుకలు రాలుతాయి. తలకు షాంపూ చేయడానికి 15 నిమిషాల ముందు ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు పట్టించాలి.

నిమ్మకాయ

నిమ్మకాయ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణించ బడుతుంది. ఇది జుట్టును వేగంగా పెంచుతుంది. నిమ్మకాయను నేరుగా జుట్టుకు పెట్టకూడదు. దీన్ని కొద్దిగా నూనెతో కలిపి మీ జుట్టుకు అప్లై చేయవచ్చు.

ఎగ్ మాస్క్

ఎగ్ మాస్క్ మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణించ బడుతుంది. గుడ్లలో 70 శాతం కెరాటిన్ ప్రొటీన్ ఉంటుంది.ఇది దెబ్బతిన్న, పొడి జుట్టును మృదువుగా చేస్తుంది. 2 గుడ్లలో 2 టేబుల్ స్పూన్ల పెరుగును కలపండి. జుట్టు కడుక్కోవడానికి 30 నిమిషాల ముందు ఈ మాస్క్ ను జుట్టుకు అప్లై చేయండి.

బట్టతల (Baldness) వంశపారపర్యంగా వస్తుందా?

బట్టతల (Baldness) వంశపారపర్యంగా వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ అయితే వాస్తవం దాని కంటే మరింత సంక్లిష్టంగా ఉంది. వంశపారంపర్యంగా వచ్చే బట్టతల గురించి 52వేల మంది పురుషులపై తాము అధ్యయనం చేశామని, బ్రిటీష్ పరిశోధకుల  బృందం తెలిపింది. ఎక్స్ క్రోమోసోమ్ లో లోపాలే బట్టతలకు 40 శాతం కారణం ఉంటాయని ఈ పరిశోధకుల బృందం తెలిపింది. 287 మందిలో జుట్టు ఊడిపోవడానికి జన్యుపరమైన సమస్యలు కూడా ఒక కారణం ఈ అధ్యయనంలో గుర్తించారు. తల్లి నుంచి బలమైన జన్యువులు పిల్లలకు రావడం నిజమే అయినప్పటికీ కేవలం ఒక్క జన్యువే బట్టతలకు కారణం కాదు అని చెప్పారు. ఒకటికి మించిన జన్యువుల వల్ల బట్టతల వస్తుందని పేర్కొన్నారు. బట్టతలకు కారణమయ్యే జన్యువులు తల్లిదండ్రులు ఇద్దరి నుంచి వస్తాయని వెల్లడించారు.

తలస్నానం చేస్తే.. క్యాప్ లు పెట్టుకుంటే

రోజు తలస్నానం చేస్తే.. క్యాప్ లు ఎక్కువ సేపు పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. జుట్టు ఊడిపోవడానికి ఇది ఒక కారణం అని పలువురు చెబుతూ ఉంటారు. కానీ జుట్టు ఊడిపోవడానికి ఇవేవి కారణం కాదని ప్రముఖ డెర్మటాలజిస్ట్ లు చెప్పారు. దానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

పురుషుల్లో, మహిళల్లో బట్టతల (Baldness)

పురుషుల్లో, మహిళల్లో బట్టతల ఒకే విధంగా ఉండదు. ఎందుకంటే పురుషుల మాదిరిగా టెస్టోస్టిరాన్ మహిళలకు ఉండదు. దీనిని సమతుల్యం చేసేందుకు అత్యధిక మొత్తంలో ఈస్ట్రొజెన్ ఉండడమే ఇందుకు కారణం.

Also Read:  Shiva Temples: ఒకే సరళ రేఖ పై 7 శివాలయాలు ఎలా నిర్మించారంటే?