Site icon HashtagU Telugu

Veg Fried Rice : ఎలాంటి సాస్ లు లేకుండా.. వెజ్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయండి

home made veg fried rice

home made veg fried rice

Veg Fried Rice : ఇంట్లో అన్నం మిగిలిపోయినపుడు దానిని పులిహోర చేయడమో, సింపుల్ గా వెజ్ ఫ్రైడ్ రైస్ చేయడమో చేస్తుంటాం. వీటిలో చాలా రకాలున్నాయి. బయట లభించే ఫ్రైడ్ రైస్ లలో మసాలాలు, సాస్ లను అధికంగా వేసి తయారు చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా బాసుమతి రైస్ తోనే ఫ్రైడ్ రైస్ చేస్తున్నారు. కానీ.. మసాలాలు, సాస్ లు వేయకుండా చాలా సింపుల్ గా ఇంట్లోనే టేస్టీ వెజ్ ఫ్రైడ్ రైస్ ను చేసుకోవచ్చు. లంచ్ లోకి కూడా బాగుంటుంది.

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు

పచ్చిమిర్చి – 4
అల్లం – 2 ఇంచుల ముక్క
వెల్లుల్లి రెబ్బలు -6 నుండి 10
టమాట – పెద్దది 1
నూనె – 4-5 టేబుల్ స్పూన్లు
జీలకర్ర – 1 టీ స్పూన్
తరిగిన ఉల్లిపాయ – 1 పెద్దది
క్యాప్సికం ముక్కలు – 1/4 కప్పు
బంగాళదుంప ముక్కలు – 1/4 కప్పు
ఫ్రెంచ్ బీన్స్ – 1/4 కప్పు
క్యారెట్ ముక్కలు – 1/4 కప్పు
స్వీట్ కార్న్ – 1/4 కప్పు
క్యాలీఫ్లవర్ ముక్కలు – 1/4 కప్పు
పచ్చి బఠాణీ – 1/4 కప్పు
ఉప్పు – రుచికి తగినంత
ధనియాలపొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – 1/2 టీ స్పూన్
అన్నం – 4-5 కప్పులు
స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం

ముందుగా ఒక మిక్సీ జార్ లో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, టమాట ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి.. అది వేడయ్యాక.. అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. కాస్త వేగిన తర్వాత.. పచ్చిమిర్చి పేస్ట్ వేసి.. నూనె పైకి తేలేంతవరకూ వేయించాలి.

ఇప్పుడు అన్ని కూరగాయల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టుకోవాలి. అవన్నీ మెతతగా ఉడికిన తర్వాత ధనియాలపొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకుని ఒక నిమిషం వేయించాలి. తర్వాత అన్నం వేసి కలుపుకుని, చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి వెజ్ ఫ్రైడ్ రైస్ ను సర్వ్ చేసుకోవడమే. దీనిని రైతాతో కలుపుకుని తింటే.. సూపర్ గా ఉంటుంది.

Also Read : Egg : ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్‌లలో ఏది ఆరోగ్యకరమైనదో మీకు తెలుసా?

 

Exit mobile version