T Shirt : మనం వేసుకునే దుస్తుల్లో మనకు కంఫర్ట్ గా ఉండేవి వాడుతుంటాము. అయితే ఇప్పుడు పిల్లలు, పెద్దలు, మహిళలు అని తేడా లేకుండా ఎవరైనా టీ షర్ట్ ని ఎక్కువగా వాడుతున్నారు. టీ షర్ట్ అందరికీ కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి డిజైన్, బ్రాండ్ ని బట్టి అన్ని వేళల్లోనూ అదే వాడుతున్నారు. ఆఫీసులకు, జిమ్ కి, ఫంక్షన్స్ కి.. ఇలా ఏ ప్లేస్ కి అయినా దానికి తగ్గట్టు టీ షర్ట్స్ వాడుతున్నారు.
కానీ అసలు T షర్ట్ ఎలా తయారు చేసారో మీకు తెలుసా? మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికన్ సైనికులు ట్రైనింగ్ సమయంలో వేసుకోవడానికి వాళ్లకు కంఫర్ట్ గా ఉండేవిధంగా బట్టలు తయారుచేయమంటే వచ్చిన డిజైన్స్ టీ షర్ట్స్. వాటిని మొదట్లో ట్రైనింగ్ సమయంలోనే వేసుకునేవారు కాబట్టి ట్రైనింగ్ షర్ట్ లు అని పిలిచేవారు. కాలక్రమేణా ట్రైనింగ్ షర్ట్స్ ని షార్ట్ కట్ లో టీ షర్ట్ అని పిలవడం వలన టీ షర్ట్ అనే పేరు ఎక్కువగా ప్రాచుర్యం పొందింది.
అయితే ఇప్పుడు కొంతమంది అవి చూడటానికి T ఆకారంలో ఉంటాయి కాబట్టి వాటిని టీ షర్ట్ అని పిలుస్తారని అంటారు. అలా ఒకప్పుడు యుద్ధ సైనికులు మాత్రమే వేసుకునే టీ షర్ట్స్ ఇప్పుడు అందరూ అన్నివేళలా వేసుకుంటున్నారు. చాలా మంది టీ షర్ట్స్ కంఫర్ట్ గా ఉందని, సింపుల్ గా వేసుకోవచ్చని, చూడటానికి కూడా లుక్స్ పరంగా బాగుంటుందని వేసుకుంటున్నారు.
Also Read : Stress: ఒత్తిడిలో ఎక్కువ ఎందుకు తింటామో తెలుసా..?