Site icon HashtagU Telugu

Healthy Life: చక్కటి నిద్రతోనే ఆరోగ్యవంతమైన జీవితం, నిద్ర కోసం చిట్కాలు ఇవిగో

Put One Of These Under Your Pillow.. Sleep Better

Put One Of These Under Your Pillow.. Sleep Better

డైలీ లైఫ్ లో ఉరుకులు పరుగులకు పుల్ స్టాప్ నిద్రే ! మానసిక విశ్రాంతినిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రివేళ గాఢ నిద్ర పోవాలంటే ఈ కొన్ని చిట్కాలు ప్రయత్నించండి. నిజానికి త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేచే వారి మేథ‌స్సు, అర్ధరాత్రి వరకు మెళ‌కువగా ఉండే వారి కంటే తక్కువగా ఉంటుంది. త్వరగా పడుకుని లేచే వారు అత్యంత ఆశావాదులు, అత్యంత చురుకైన వాళ్ళు. త్వరగా నిద్రపోయి, త్వరగా నిద్ర లేస్తే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. యాక్టివ్ గా ఉండగలరు.

అలానే అనుకున్న వాటిపై దృష్టి పెట్టొచ్చు. వారి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి అవుతుంది. పైగా త్వరగా నిద్రపోయి, త్వరగా లేవడం వలన మన పనులని ముందుగా మనం మొదలు పెట్టచ్చు. దానితో చాలా సమయం ఆదా అవుతుంది. ఎక్కువ సమయం ఇంకా మిగిలి ఉంటుంది. మన పనులు కూడా పూర్తయిపోతుంటాయి. ఆలస్యంగా నిద్రపోవడం లేదా నిద్ర పట్టకపోవడం వలన నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దాంతో మెదడు కూడా సరిగ్గా పని చేయదు. హ్యాపీగా ఉంచే సెరోటోనిన్ వంటి హార్మోన్లు కూడా తక్కువ ఉత్పత్తి అవుతాయి.

ప్రతి రోజూ రాత్రి నిర్ణీత సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే నిర్ణీత సమయానికి కూడా లేవడం అలవాటు చేసుకోవడం వల్ల సరైన టైంకు నిద్ర పడుతుంది. పడకగదిలో నిద్రపోయే వాతావరణం ఉండాలి. భోజనం చేసిన వెంటనే పడుకోకండి. పడుకునే ముందు కనీసం మూడు గంటల వరకు ఏమీ తినకూడదు. టీ లేదా కాఫీ వంటివి తాగవద్దు. నిద్రపోయే ముందు శరీరంపై ఒత్తిడి లేకుండా చూసుకోండి. ఇష్టమైన పుస్తక పఠనం, దీర్ఘ శ్వాసలు, ధ్యానం అందుకు ఉపయోగపడతాయి.

Also Read: Recording Dance: అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు, వీడియో వైరల్