Hair Tips: తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ హోమ్ రెమెడీస్ ని ఫాలో అవ్వాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలా

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 09:30 PM IST

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య చాలామందిని వేధిస్తోంది. అయితే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలా మంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆ చిట్కాలు అంతగా వర్కౌట్ అవ్వవు. దీంతో చాలామంది చేసేదేమీ లేక

తెల్ల జుట్టుకు నల్ల రంగు వేసుకుంటూ ఉంటారు. ఈ రంగు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది వెంట్రుకలు మళ్లీ తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.అయితే జుట్టుకి నలుపు కలర్ కలగజేసే కణజాలంను మెలనో సైట్స్ అని అంటారు. ఇది మెలనిన్ అని హార్మోన్లు విడుదల చేస్తాయి. ఇవి నలుపు కలర్ ని ఉత్పత్తి చేసి జుట్టుకి అందిస్తాయి. అప్పుడు జుట్టు నల్లగా మారుతుంది. ఈ మెలనో సైట్ కణాలు నశించినప్పుడు ఆ భాగంలో నలుపు కలర్ ఉత్పత్తి అవ్వకపోవడం వలన అక్కడ వెంట్రుకలు తెల్లగా అవుతుంటాయి. ఇలా నలుపు కలరు ఉత్పత్తి చేసే మెలనో సైడ్స్ నశించడం వలన జుట్టు తెల్లగా అయిపోతుంది. అయితే ఇందుకోసం కానుగ నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానుగ నూనెను వేడి చేసినప్పుడు ఐదు రకాల పవర్ఫుల్ కెమికల్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి.

ఈ ఆయిల్ ను తయారు చేసేటప్పుడు హీట్ చేయడం వలన ఈ పవర్ఫుల్ బయో ఆక్టివ్ కాంపౌండ్స్ యాక్టివేట్ జరుగుతాయి దాని వలన ఈ నూనెను మూడు నుంచి ఐదు చుక్కలు తీసుకొని కొబ్బరి నూనెలో కలుపుకొని ఇక దానిని మాడుకు బాగా అప్లై చేస్తే జుట్టు కుదుళ్ళు లోపలి నుంచి ఈ నూనె వెళ్లి నలుపు కలర్ ని ఉత్పత్తి చేసే మెలనో సైడ్స్ నశించకుండా రక్షిస్తుంది. ఇది సైంటిఫిక్ గా కూడ నిరూపించబడింది. అలాగే తలలో ఇంఫ్లమేషన్ తగ్గించడానికి దురదలు నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ నూనె బాగా సహాయపడుతుంది. సాధారణంగా దీనిని సోరియాసిస్ దురదలు చర్మ సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్లు కూడా వాడుతూ ఉంటారు. అయితే మాడు భాగానికి వినియోగించడం వలన తలలో ఉండే దురదలు, చుండ్రు లాంటివి తగ్గిపోవడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. నలుపు రంగు ఉత్పత్తి అవ్వడం వలన తెల్ల జుట్టు తొందరగా రాకుండా కాపాడుతుంది. కావున ఈ నూనెని తెచ్చుకొని వయసు తరహా లేకుండా వాడవచ్చు.