Site icon HashtagU Telugu

No To Fridge : ఫ్రిజ్‌లో ఉంచకూడని 10 వస్తువులివే..

Fridge

Fridge

No To Fridge : చాలామంది ఫ్రిజ్‌లో ఏది పడితే అది పెట్టేస్తుంటారు. అయితే కొన్ని పదార్థాలను ఫ్రిజ్​లో అస్సలు పెట్టకూడదని ఎంతోమందికి తెలియదు.  కొన్ని ఆహార పదార్థాలు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని తగిన ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. ఈవిషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రిజ్‌లో ఉంచకూడని కొన్ని పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join.

బంగాళదుంపలు

బంగాళదుంపలను ఫ్రిజ్​లో అస్సలు ఉంచకూడదు. వాటిని బయట ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం బెటర్. ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచితే  చల్లటి ఉష్ణోగ్రత ప్రభావంతో బంగాళదుంపల్లో ఉండే స్టార్చ్​ షుగర్​గా మారుతుంది. ఫలితంగా అవి మరీ తియ్యగా లేదా గట్టిగా అయిపోతాయి. దీంతో అవి వంటకు పనికిరాకుండా పోతాయి.

మూలికలు

మూలికలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. తులసి, రోజ్మేరీ వంటి మూలికలను  ఫ్రిజ్​లో నిల్వ చేస్తే(No To Fridge) అవి ఎండిపోతాయి. ఈ మూలికలను చిన్న గ్లాసులో వేసి గది ఉష్ణోగ్రత వద్ద నీటిలో ఉంచాలి.

కిరాణా వస్తువులు

కిరాణా వస్తువులను ఒకేసారి ఎక్కువగా కొని, ఫ్రిజ్​లో ఉంచి వాడడం అంత మంచిది కాదు.

ఉల్లిపాయలు

తరిగిన ఉల్లిపాయలను ఫ్రిజ్​లో ఉంచకూడదు.  సాధారణంగా ఉల్లిపాయలను ఫ్రిజ్​లో ఉంచకపోవడమే బెటర్.

వెల్లుల్లి

వెల్లుల్లిని బహిరంగ ప్రదేశాల్లో స్టోర్ చేయడమే బెటర్. ప్లాస్టిక్ కవర్లలో స్టోర్ చేయకూడదు. అలా చేస్తే తేమ పేరుకుపోయి వెల్లుల్లి త్వరగా పాడవుతుంది. ఫ్రిజ్​లో అస్సలు పెట్టకూడదు.

అరటి

గది ఉష్ణోగ్రతలోనే అరటిపండ్లను ఉంచాలి. ఫ్రిజ్​లో పెడితే అవి పాడవుతాయి. వెచ్చని ఉష్ణోగ్రతలో ఉంచితే పండు పూర్తిగా పక్వానికి వస్తుంది.అరటిపండ్లను ఫ్రిజ్​లో పెట్టకపోవడమే బెటర్.

పుచ్చకాయలు

పుచ్చకాయలను కట్ చేయకుంటే బయట ఉంచడమే మంచిది. వాటిని ముక్కలుగా కోసిన తర్వాతే ఫ్రిజ్​లో నిల్వచేయాలి.

టమాటాలు

టమాటాలను  ఫ్రిజ్​లో ఉంచకూడదు. ఫ్రిజ్​లో పెడితే టమాటాల టేస్ట్ మారుతుంది. అందుకే వంట గదిలో బయట నిల్వ చేయడం బెటర్.

బ్రెడ్

వాస్తవానికి బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేయకూడదు. ఎందుకంటే బ్రెడ్ స్టార్చ్‌లో ఉండే అణువులు చల్లని ఉష్ణోగ్రతకు త్వరగా రీక్రిస్టలైజ్ అవుతాయి. దీంతో బ్రెడ్ గట్టిగా మారిపోయి, రుచిని కోల్పోతుంది. అందుకే బ్రెడ్​ను ఓ బాక్స్​లో స్టోర్ చేయడం బెటర్.

చాక్లెట్లు

ఫ్రిజ్​లో ఉంచిన చాక్లెట్లను తింటే కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే చాక్లెట్లను ఫ్రిజ్​లో ఉంచకూడదు. ఒకవేళ ఫ్రిజ్​లో ఉంచితే అవి ఇతర ఆహార పదార్థాల వాసనను పీల్చుకుని రుచిని, రంగును కోల్పోతాయి.

Also Read: Rs 4000 Pension : 4వేల పింఛను అమల్లోకి వచ్చేది ఎప్పుడు.. కొత్త అప్‌డేట్