కొత్త చెప్పులు(New Slippers) వేసుకోవడం అంటే పిల్లలకు, పెద్దలకు కూడా అందరికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఆడవారు అయితే హీల్స్, ఫ్లాట్స్, పార్టీ వేర్, షూస్, స్లిప్పర్స్ ఇలా రకరకాలవి చెప్పులు వాడుతుంటారు. చెప్పులు కొత్తవి వాడినప్పుడు కొంతమందికి కాళ్ళపైన దద్దుర్లు, చిన్న గాయాలు, రాషెస్ వంటివి వస్తుంటాయి. కాబట్టి మనం కొత్త చెప్పులు వాడాలి అని అనుకున్నప్పుడు ముందు చెప్పులకు డియోడరెంట్ లేదా హెయిర్ సీరం వంటివి రాసుకుంటే కాళ్లకు చెప్పులకు మధ్య రాపిడి తగ్గుతుంది.
చిన్న పిల్లలకు కొత్తవి చెప్పులు వాడుతున్నట్లైతే ముందు చెప్పులకు కొద్దిగా కొబ్బరినూనె రాస్తే వారి పాదాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొత్త చెప్పులు వేసుకునే ముందు చెప్పులకు పెట్రోలియం జెల్లీ లేదా ఏదయినా వ్యాజిలెన్ వంటివి రాసుకున్న కూడా కాళ్లకు ఏమి జరగకుండా ఉంటుంది. కొబ్బరినూనె రాసుకున్నా కూడా కాళ్లకు కొత్త చెప్పులు కరవకుండా ఉంటాయి. మనకు ఎక్కడైతే చెప్పులు ఒరుసుకుంటున్నాయో అక్కడ సర్జికల్ టేప్ లేదా బ్యాండ్ ఎయిడ్ వేసుకుంటే చెప్పులు ఒరుసుకుపోకుండా ఉంటాయి.
కొత్త షూస్ వాడాలి అనుకున్నప్పుడు వాటిలో బేబీ పౌడర్ చల్లితే అది మన కాళ్లకు ఇబ్బంది కలగకుండా చేస్తుంది. హీల్స్ వేసుకునేటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి హీల్ గ్రిప్స్, హై హీల్స్ ప్యాడ్స్ వంటివి వాడుకుంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ చెప్పులు కొత్తవి వాడినప్పుడు కాళ్ళు ఎర్రగా అయిపోతే, వాతలు పడినట్లైతే ఆ చోట ఐస్ క్యూబ్స్ ని ఒక క్లోత్ లో చుట్టి కాపడం పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె, బాదం నూనె రెండింటిని సమాన భాగాలుగా కలుపుకొని దానిని కూడా కాళ్ళకి రాసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది.
Also Read : Barefoot Benefits : చెప్పులు లేకుండా నడిస్తే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా ?